Salaar OTT and Satellite streaming partner details: సలార్ OTT – శాటిలైట్ స్ట్రీమింగ్ పార్ట్నర్ వివరాలు అధికారికంగా విడుదలయ్యాయి. భారీ అంచనాల నడుమ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియన్ మూవీ సలార్ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. మంచి పాజిటివ్ టాక్ తో ఈ సినిమా దూసుకుపోతూ బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంటోంది. ఇక నిజాయికి ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ గురించి చెప్పాలంటే ముందుగా సినిమ టీం అమెజాన్ ప్రైమ్ వీడియోతో చర్చలు జరిపింది, ఎందుకంటే హోంబలే ఫిల్మ్స్ మునుపటి సినిమాలు అయిన KGF, KGF 2, కాంతారా అన్ని సినిమా డిజిటల్ హక్కులను ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. ఇక ఈ క్రమంలో ఈ సినిమా గురించి కూడా చర్చలు ప్రారంభమయ్యాయి కానీ వర్కౌట్ కాలేదు.
Prashanth Neel: కింగ్ ఖాన్ పైన పగబట్టి.. గురి చూసి కొట్టినట్టుందే!
ఈ క్రమంలో Netflix సలార్ డిజిటల్ హక్కులు భారీ రేటు వెచ్చించి కొనుగోలు చేసింది. ఇప్పుడు, నెట్‌ఫ్లిక్స్ అన్ని భాషలకు సలార్ యొక్క స్ట్రీమింగ్ భాగస్వామి, ఎనిమిది వారాల తర్వాత OTTలో ప్రసారం అవుతుందని అంచనా. ఇక ఈ సినిమా శాటిలైట్ పార్టనర్ స్టార్ మా. ఈ సలార్, ఒక ఊహాజనిత ఖాన్సార్ అనే సిటీ ఆధారంగా, ఇద్దరు ప్రాణ స్నేహితులైన దేవా -వరద మధ్య స్నేహం చుట్టూ తిరిగే కథతో తెరకెక్కించారు. వరదకు ప్రాణహాని ఏర్పడినప్పుడు, దేవా తన స్నేహితుడి కోరిక మేరకు రంగంలోకి దిగుతాడు. అయితే, అనుకోని సంఘటనలు మంచి స్నేహితులను శత్రువులుగా మారుస్తాయి. సలార్‌లో ప్రభాస్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్ మరియు జగపతి బాబు ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేశారు. డిసెంబర్ 22న అంటే ఈరోజు ఈ సినిమా హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది.