NTV Telugu Site icon

Salaar: నైజాంలో నెవర్ బిఫోర్ రేట్ తో సలార్ టికెట్లు?

Salar

Salar

Salaar makers applied for record ticket prices in Nizam Area: ప్రభాస్ హీరోగా నటించిన పాన్-ఇండియా యాక్షన్ మూవీ సలార్ విడుదలకు ఇంకా 10 రోజుల సమయం ఉంది. నిజానికి ప్రమోషన్స్ ఆశించిన స్థాయిలో లేదని ప్రభాస్ అభిమానులు ఎంత మొత్తుకుంటున్నా మరో పక్క హైప్ కూడా నెమ్మదిగా ఒక రేంజ్ కి చేరుతోంది. ప్రశాంత్ నీల్ అండ్ కో ఈ సినిమా రికార్డు ఓపెనింగ్స్‌పై నమ్మకంతో ఉన్నారు. రాబోయే 10 రోజుల్లో ప్రమోషన్స్ ఒక రేంజ్ లో ఉంటాయని మేకర్స్ చెబుతున్నా ఆ విషయంలో నమ్మకం లేదంటున్నారు ప్రభాస్ అభిమానులు. అయితే మరోపక్క టీమ్ మాత్రం RRRతో సమానంగా టిక్కెట్ల పెంపు కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే నైజాంలో హైక్ మరియు స్పెషల్ షోల కోసం టీమ్ దరఖాస్తు చేసుకుంది. ఈ సలార్ సినిమాకి వర్తించే ధరలు కూడా RRRకు దగ్గరగా ఉంటాయని అంటున్నారు. ఇక ఆ లెక్కల ప్రకారం మల్టీప్లెక్స్‌లకు జీఎస్‌టీతో కలిపి రూ.413, సింగిల్ స్క్రీన్‌లకు జీఎస్టీతో కలిపి రూ.236 టికెట్ ధరలు పెంచనున్నారు.

Mangalavaaram : మంగళవారం ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతి..?

ఈ పెంపు 1వ వారాంతం వరకు వర్తిస్తుంది. వారాంతం తర్వాత వచ్చే వారంలో జిఎస్‌టితో సహా టిక్కెట్ ధరలు మల్టీప్లెక్స్‌లకు రూ. 354 మరియు సింగిల్ స్క్రీన్‌లకు రూ. 230గా ఉండేలా చూసుకుంటున్నారు. ఇది కొత్త ప్రభుత్వానికి అభ్యర్థించిన మొదటి పెంపు అనుమతి. ఇక ప్రభుత్వం నుంచి మేకర్స్ గ్రీన్ సిగ్నల్ అందుకుంటారో లేదో వేచి చూడాలి. ప్రస్తుతానికి, ప్రభుత్వం ఆమోదించిన ధరలు మల్టీప్లెక్స్‌లకు రూ. 295 మరియు సింగిల్ స్క్రీన్‌లకు రూ. 175 గా ఉన్నాయి. ఇక సలార్ ఒక యాక్షన్-ప్యాక్డ్ డ్రామా, ఇందులో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు, ఈశ్వరీ రావు, శ్రీయా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగాదూర్ నిర్మించిన ఈ ప్రాజెక్టుకు రవి బస్రూర్ స్వరాలు సమకూర్చారు.