కాటేరమ్మ కొడుకు ఇండియన్ బాక్సాఫీస్ ని ఊచకోత కోస్తున్నాడు. మొదటి రోజు దాదాపు 180 కోట్లు రాబట్టి 2023 బిగ్గెస్ట్ ఓపెనింగ్ రికార్డ్ ని సెట్ చేసిన ప్రభాస్… డే 2 కూడా ర్యాంపేజ్ చూపించాడు. ఒక యుద్ధం బాక్సాఫీస్ పైన పడితే ఎలా ఉంటుందో చూపిస్తూ సలార్ సినిమా రెండో రోజు 145-150 కోట్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. డే 1 పక్కన పెడితే సలార్ డే 2నే 2023లో రిలీజైన మిగిలిన అన్ని సినిమాల ఓపెనింగ్ డే కన్నా ఎక్కువ కలెక్షన్స్ ని రాబట్టింది. ఇది ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినాని నిదర్శనం. ప్రశాంత్ నీల్ పెద్దగా ప్రయోగాలు చేయకుండా, ప్రభాస్ స్ట్రెంగ్త్ ని నమ్మి అందులోనే సలార్ సినిమాని చేసాడు. ప్రభాస్ బెస్ట్ లుక్స్ లో ఎలా కనిపిస్తాడు అనే ఒకే ఒక్క విషయాన్ని మైండ్ లో పెట్టుకోని డిజైన్ చేసిన సలార్ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్ ని రిపీట్ మోడ్ లో థియేటర్స్ కి రప్పిస్తున్నాయి.
ఈరోజు సండే కాబట్టి డే 3 డే 2 కన్నా ఎక్కువ కలెక్షన్స్ రావడం గ్యారెంటీ. ఇదే జరిగితే మూడు రోజుల్లో ప్రభాస్ దాదాపు 450 కోట్లు కలెక్ట్ చేస్తాడు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వేరే ఏ హీరో కూడా ఈ రేంజ్ ఫీట్ ని అచీవ్ చేయడం కూడా ఇంపాజిబుల్ అనే చెప్పాలి. ఆరున్నర ఏళ్ల ఆకలి తీరుస్తున్న సలార్ సినిమా రేపటి మండే లిట్మస్ టెస్ట్ ని ఎంత సక్సస్ ఫుల్ గా పాస్ అవుతుంది అనే దానిపై సలార్ ఫ్యూచర్ కలెక్షన్ల ప్రిడిక్షన్ డిపెండ్ అయ్యి ఉంది. మండే కనుక సలార్ సినిమా స్ట్రాంగ్ గా నిలబడితే ప్రభాస్ బాక్సాఫీస్ దగ్గర విధ్వంసం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాడు.
