NTV Telugu Site icon

Salaar: సలార్ మరో సెన్సేషన్… తెలుగు రాష్ట్రాల్లో RRR రికార్డు బ్రేక్

Salaarrrr

Salaarrrr

Salaar Becomes 4th Day Highest Share Collecetd Movie by Crossing RRR: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన సలార్ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ సినిమాకి క్రిస్టమస్ సెలవులు కూడా కలిసి రావడంతో ఈ సినిమాకి హౌస్ ఫుల్ బోర్డులు ఎక్కువగా పడుతున్నాయి. ఇక ఈ సినిమా మరో సరికొత్త రికార్డు బద్దలు కొట్టింది. ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్ పేరు మీద ఉన్న రికార్డును ఈ సలార్ సినిమా బద్దలు కొట్టింది. ఏపీ తెలంగాణలో కలిపి 4వ రోజు అత్యధిక షేర్ సాధించిన సినిమాల లిస్టు ఈ మేరకు ఉంది. 18.05 కోట్లతో సలార్ మొదటి ప్లేసులో ఉండగా ఆర్ఆర్ఆర్ 17.73 కోట్లతో రెండో ప్లేసులో ఉంది.

Vishal: న్యూయార్క్ లో ఆమెతో చెట్టాపట్టాల్.. కెమెరా చూసి ముఖం దాచి పరిగెత్తిన విశాల్?

ఇక తరువాత బాహుబలి2 – 14.65 కోట్లు, సర్కారు వారి పాట – 12.06 కోట్లు, అలవైకుంఠపురములో – 11.56 కోట్లు, వాల్తేర్ వీరయ్య – 11.42 కోట్లు, కేజీఎఫ్ 2 (డబ్) – 10.81 కోట్లు, సాహో – 9.60 కోట్లు, సరిలేరు నీకెవ్వరు- 8.67 కోట్లు, మహర్షి – 8.44 కోట్లు, అఖండ- 8.31 కోట్లు షేర్ సాధించి టాప్ టెన్ నాలుగో రోజు అత్యధిక షేర్ సాధించిన సినిమాలుగా నిలిచాయి. ఇక సలార్ సినిమా టోటల్ కలెక్షన్స్ వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఇక ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. సలార్ రెండు భాగాలుగా రూపొందనున్న సంగతి తెలిసిందే. మొదటిది ‘సాలార్- సీజ్ ఫైర్(కాల్పుల విరమణ)’ కాగా రెండవది ‘సాలార్ – శౌర్యాంగ పర్వం.’ ప్రభాస్ దేవా అలియాస్ సాలార్ పాత్రలో నటించగా, పృథ్వీరాజ్ సుకుమారన్ వరద రాజ మన్నార్‌గా, జగపతి బాబు రాజమన్నార్‌గా, శృతి హాసన్ ఆద్యగా కనిపించారు. సలార్ పార్ట్ వన్ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైంది.

Show comments