NTV Telugu Site icon

Salaar 3 Days Collections: 3 రోజులు- 402 కోట్లు.. సలారోడు దిగితే ఇలానే ఉంటది!

Salaar 2

Salaar 2

Salaar 3 Days Collections Worldwide: రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన యాక్షన్ మూవీ ‘సలార్: సీజ్‌ఫైర్’ ఎట్టకేలకు శుక్రవారం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రశాంత్ నీల్ తీసిన ఈ సినిమాను హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మించగా శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటించారు. శ్రీయా రెడ్డి, టిను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావు వంటి వారు కీలక పాత్రల్లో నటించగా రవి బస్రూర్ సంగీతం అందించాడు. ఇక ఈ సినిమా 3వ రోజు తెలుగులో మంచి కలెక్షన్స్ రాబట్టింది. నైజాంలో రూ. 10.97 కోట్లు, సీడెడ్‌లో రూ. 3.20 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.73 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.41 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 85 లక్షలు, గుంటూరులో రూ. 1.20 కోట్లు, కృష్ణాలో రూ. 1.27 కోట్లు, నెల్లూరులో రూ. 77 లక్షలతో.. రూ. 22.40 కోట్లు షేర్, రూ. 35.65 కోట్లు గ్రాస్ వసూలు చేసింది సాలార్ సినిమా.

Ugly Story: చిన్నారి పెళ్లికూతురితో గీతామాధురి భర్త అగ్లీ స్టోరీ

ఇక 3 రోజుల్లో ‘సలార్: సీజ్‌ఫైర్’ తెలుగులో ప్రాంతాల వారీగా చూస్తే నైజాంలో రూ. 44.57 కోట్లు, సీడెడ్‌లో రూ. 12.65 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 9.77 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 7.31 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.72 కోట్లు, గుంటూరులో రూ. 6.80 కోట్లు, కృష్ణాలో రూ. 4.80 కోట్లు, నెల్లూరులో రూ. 3.30 కోట్లతో.. రూ. 93.92 కోట్లు షేర్, రూ. 140.30 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 3 రోజుల్లో తెలుగులో రూ. 93.92 కోట్లు, తమిళంలో రూ. 5.80 కోట్లు, కర్నాటకలో రూ. 13.35 కోట్లు, కేరళలో రూ. 4.05 కోట్లు, హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 29.75 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 38.80 కోట్లు షేర్ వసూలు చేయగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 185.67 కోట్లు షేర్, రూ. 402 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్టు ప్రకటించారు మేకర్స్.

Show comments