NTV Telugu Site icon

V.C. Sajjanar : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారి బెండు తీస్తున్న సజ్జనార్

Sajjanar

Sajjanar

దేశ భవష్యత్తు యువతపైనే ఆధారపది ఉందని వివేకానంద చెప్తుండేవారు. ఒక భారతదేశంలో ఉన్న యువత ప్రపంచంలో మరేఇతర దేశంలోను లేదు. అలంటి యువతిని కొందరు తమ స్వార్థం కోసం తప్పుదోవ పట్టించి వారిని వ్యసనాలకు బానిసలుగా చేయాలనీ చూస్తున్నారు. మరి ముఖ్యంగా కొందరు సెలబ్రిటీస్ పేరుతో ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసేందుకు ఆ కంపెనీల నుండి లక్షల లక్షల సొమ్ము తీసుకుని యువతని బెట్టింగ్ యాప్స్ కు బానిసలుగా చేస్తున్నారు. దీనిని ఎలాగైనా సరే అడ్డుకట్ట వేయాలని యువతను ఈ బెట్టింగ్స్ భారీ నుండి తప్పిచాలని పూనుకున్నారు హైదరాబాద్ మాజీ అడిషల్ డీజీపీ, ప్రస్తుత ఆర్టీసీ ఎండి వీసీ సజ్జనార్..

Also Read : RAPO : రామ్ పోతినేని.. చందు మొండేటి.. మ్యాటర్ ఏంటంటే..?

లోకల్ బాయ్స్ నుండి సినిమా సెలెబ్రెటీస్ వరకు ఎవరెవరు ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారో వారి భరతం పడుతున్నారు సజ్జనార్. మీ స్వార్ధ ప్రయోజనాల కోసం యువత భవిష్యత్తును నాశనం చేయాలని చుస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. దింతో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసిన వాళ్ళు ఒక్కొక్కలుగా వచ్చి సారీ చెప్తున్నారు. పోలీస్ కేసులకు భయపడి చెప్తున్నారా లేక వాళ్లలో మానవత్వం పరిమళించిందా అనేది పక్కన పెడితే ఒక్కొక్కరు వారు ప్రమోట్ చేసిన విడియోలను సైతం తమ అకౌంట్స్ నుండి డిలీట్ చేస్తున్నారు. ఇప్పటికే లోకల్ బాయ్, భయ్యా సన్నీ యాదవ్, యూట్యూబ్ హర్ష మీద కేసులు పెట్టి వారిని కటకటాల వెనక్కి పంపారు. సినీనటి సురేఖ కూతురు ఇంకెప్పుడు బెట్టింగ్ యాప్స్ ను ప్రోమోట్ చేయను అని క్షమాపణలు చెప్తూ వీడియో రిలీజ్ చేసింది. బుల్లితెర నటి రీతు చౌదరి ఇంకా కొంతమంది పోలీస్ కేసులు అవుతుండటంతో వీడియోస్ డిలీట్ చేస్తున్నారు. నా అన్వేషణ అనే యూట్యూబర్ తో కలిసి అవగాహణ పెపొందేలా వీడియోలు చేస్తున్నారు సజ్జనార్. ఇప్పటికైనాబెట్టింగ్ యాప్స్ ప్రోమోట్ చేసే సైబర్ టెర్రరిస్టుల అకౌంట్స్ ను అన్ ఫాలో కొట్టండి. వారి అకౌంట్ లను రిపోర్ట్ చేయండి. ఎవరైనా బెట్టింగ్ యాప్ ల వల్ల నష్టపోతే సమీపంలోని పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయండని సజ్జనార్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదేమైనా సజ్జనార్ పూనుకున్న ఈ నిర్ణయం పట్ల సోషల్ మీడియాలో మంచి స్పందన లభించింది. ప్రజా ప్రయోజనాల కోసం యువత భవిత కోసం సజ్జనార్ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసున్నారు.