Site icon NTV Telugu

Sailesh Kolanu: అనిమల్ పై శైలేష్ సంచలన వ్యాఖ్యలు.. ఖండించిన డైరెక్టర్

Sailesh

Sailesh

Sailesh Kolanu: హిట్ చిత్రంతో ఒక క్రైమ్ థిల్లర్ సినిమా యూనివర్స్ ని క్రియేట్ చేశాడు డైరెక్టర్ శైలేష్ కొలను. ఈ సినిమాలు భారీ విజయాన్ని అందుకొని.. శైలేష్ కు మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి. ఇక ప్రస్తుతం శైలేష్ కోలన్ హిట్ యూనివర్స్ ను పక్కన పెట్టి వెంకటేష్ తో సైంధవ్‌ అనే యాక్షన్ థ్రిల్లర్ ని తెరకెక్కిస్తున్నాడు. వెంకటేశ్ 75వ సినిమాగా ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన శైలేష్.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో అనిమల్ సినిమాపై, సందీప్ రెడ్డి పై శైలేష్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

” డైరెక్టర్స్ కు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది.. తాను అనుకున్నది తానే… సొసైటీ ఏం అనుకుంటుంది అనేది ఆలోచించరు అనేది వారి వ్యక్తిగతం. మీరు పుట్టిన, పెరిగిన విధానం ఏంటి..? సొసైటీ మీద మీ ఆటిట్యూడ్ ఎలా ఉంది అనే దాని బట్టి ఉంటుంది. కానీ, చివరకు సినిమా అనేది ఒక ఆర్ట్ ఫార్మ్. జనాలను ప్రభావితం చేసే ఆర్ట్. ఒక ఫిల్మ్ మేకర్ గా నేను చెప్తుంది ఏంటంటే.. కొన్ని సీన్స్ తీసే సమయంలో నేను సొసైటీ గురించి ఆలోచిస్తాను. రాసుకున్నప్పుడు చాలా రాసుకుంటాం.. కానీ, తీసే టైమ్ లో నేను కొంతవరకు ఆలోచిస్తాను. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు కోసం నేను కొంతవరకు ఆలోచించి సీన్స్ రాస్తాను. అది వేరే డైరెక్టర్.. నన్ను నువ్వు జడ్జ్ చేయలేవు.. నాకు నచ్చినట్టు నేను తీస్తాను అంటే అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్.. నేను ఏం అనలేను” అని చెప్పుకొచ్చాడు. అయితే శైలేష్ మాటలను ఒక సైట్ వేరే విధంగా చిత్రీకరించి రాసింది. ” ఒక డైరెక్టర్ వల్గర్ సీన్స్ తీయడం.. అతను పుట్టి పెరిగిన విధానాన్ని బట్టి, వాల్యూస్ ను బట్టి ఉంటుంది. నేను ఒక సీన్ రాసినప్పుడు సొసైటీ మీద రెస్పాన్సిబిలిటీ తో రాస్తాను” అన్నట్లు చెప్పుకొచ్చారు. ఇక ఈ వ్యాఖ్యలను శైలేష్ ఖండించాడు.

“ఇలా సందర్భం లేకుండా చేసిన పోస్ట్ తో మీకు వచ్చిన లైక్‌లు మరియు కామెంట్స్ తో మీరూ హ్యాపీ అయ్యుంటే, నేను మీ కోసం చాలా సంతోషంగా ఉన్నాను బ్రదర్. నా మీద పోస్ట్ చేస్తే అంత ట్రాక్షన్ ఉండదు మీకు.. అంత పెద్దోన్ని కూడా కాదు నేను..అందరూ సంతోషంగా ఉండండి” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి సంక్రాంతి బరిలో దిగుతున్న శైలేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Exit mobile version