Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Sailesh Kolanu Interview For Saindhav Movie

Sailesh Kolanu: నా లైఫ్ లో జరిగిన సంఘటనలతో మంచి లవ్ స్టోరీ చేస్తా.. ‘సైంధవ్’ డైరెక్టర్ శైలేష్ కొలను ఇంటర్వ్యూ

Published Date :January 9, 2024 , 6:26 pm
By Bhargav Chaganti
Sailesh Kolanu: నా లైఫ్ లో జరిగిన సంఘటనలతో మంచి లవ్ స్టోరీ చేస్తా.. ‘సైంధవ్’ డైరెక్టర్ శైలేష్ కొలను ఇంటర్వ్యూ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Sailesh Kolanu interview for Saindhav Movie: విక్టరీ వెంకటేష్ పాన్ ఇండియా మూవీ ‘సైంధవ్ జనవరి 13న గ్రాండ్ గా విడుదల కానుంది. ’. వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో డైరెక్టర్ శైలేష్ కొలను విలేకర్ల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

సైంధవ్ ప్రాజెక్ట్ ఎలా స్టార్ అయ్యింది ?
– ‘హిట్ 2’ విడుదలైన తర్వాత నిర్మాత వెంకట్ వెంకటేష్ ని కలవమని చెప్పగా కలిశా. సినిమా బాగా తీశానని అభినందించారు. మొదట కలిసినప్పుడు అసలు సినిమా గురించి మాట్లాడలేదు. జనరల్ లైఫ్ గురించి సరదాగా మాట్లాడుకునే వాళ్ళం, రెండు మూడు మీటింగ్స్ లో మా మధ్య మంచి బాండ్ ఏర్పడింది. తర్వాత కలిసి ఒక సినిమా చేస్తే బాగుంటుంది కదా అని ఇద్దరికీ అనిపించింది. అప్పుడు నా దగ్గర వున్న కథల్లో సైంధవ్ ఐడియా చెప్పాను. ఆయనకు చాలా నచ్చింది. ‘ఇది నా 75వ సినిమా అనిపిస్తోంది’ అని చెప్పారు. తర్వాత ఐడియాని డెవలప్ చేసి పూర్తి స్థాయి స్క్రిప్ట్ గా చెప్పాను. కథ మొత్తం విని ఓ హాగ్ ఇచ్చి.. ‘ఇది చేస్తున్నాం’ అన్నారు. ఆయన అనుభవాన్ని, ఫీడ్ బ్యాక్ ని జోడించి స్క్రిప్ట్ ని ఇంకా బెటర్ చేసిన తర్వాత షూటింగ్ మొదలుపెట్టాం.

హిట్ తో రెండు విజయాలు అందుకున్నారు కదా.. దీంతో హ్యాట్రిక్ కొట్టాలనే ఒత్తిడి ఉందా ?
నేను ఎప్పుడూ ఒత్తిడి తీసుకొను. నిజాయితీగా సినిమాలు తీసుకుంటూ వెళ్ళడమే పైనే నా దృష్టి ఉంటుంది. జయాపజయాల గురించి కాకుండా జర్నీని ఆస్వాదించే తత్వం నాది. ఒక ప్రాసెస్ ఫాలో అవుతూ నిజాయితీగా సినిమా తీస్తే ఖచ్చితంగా సినిమా విజయం సాధిస్తుందని నమ్ముతాను. సైంధవ్ కూడా అదే అభిరుచితో చేశాను.

ఇది వెంకటేష్ 75వ చిత్రం కదా.. ఆ ఒత్తిడి ఉందా ?
మొదట లేదు. గత వారం రోజులుగా ఉంది. ఈవెంట్స్ లో వెంకటేష్ ఏవీలు చూస్తున్నపుడు ఇంత అద్భుతమైన జర్నీ ఉన్న హీరోతో సినిమా చేశామా? అనే టెన్షన్ వస్తుంది. నిజానికి ఈ ఒత్తిడి వెంకటేష్ మా వరకు తీసుకురాలేదు. అంత చక్కగా నాతో కలిసిపోయారు. సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు. వెంకటేష్ 75వ చిత్రం ఎలా ఉండాలో ఇలా చేశాం. ఫ్యాన్స్, ఆడియన్స్ కి నచ్చేలా చిత్రాన్ని తీర్చిదిద్దాం.

స్క్రిప్ట్ విషయంలో వెంకటేష్ ఎలాంటి ఇన్ పుట్స్ ఇచ్చారు ?
ఇప్పటివరకు నేను ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ చేశాను. ఇంత ఎమోషనల్ డెప్త్ ఉన్న కథ చేయడం ఇదే మొదటిసారి. వెంకటేష్ ఎమోషనల్ సీన్స్ లో చాలా అద్భుతమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. ఎమోషనల్ సీన్స్ డీల్ చేయడంలో ఆయన ఇచ్చిన సలహాలు చాలా ఉపయోగపడ్డాయి.

ఆర్య, ఆండ్రియా, రుహాని ఇలాంటి ప్రముఖ తారాగణం తీసుకోవడానికి కారణం ?
ఇందులో ప్రతి పాత్ర ఒక విషయాన్ని కమ్యునికేట్ చేస్తుంది. ఆ కమ్యునికేషన్ వైడర్ ఆడియన్స్ కి చేరాలి. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న వారి పోరాటానికి బలమైన గొంతు లేదు. రూ.17 కోట్ల ఇంజెక్షన్ కోసం తపన పడే పేరెంట్స్ గురించి, వారి పోరాటం గురించి మనకి పెద్ద అవగాహన లేదు. ఇలాంటి అవగాహన తెప్పించాలని వైడర్ గా కమ్యునికేట్ చేసే నటులు కావాలి, అలాంటి గొప్ప ఉద్దేశంతో, కథ నచ్చి ఆర్య, ఆండ్రియా, రుహాని శర్మ లాంటి నటులు ఇందులో భాగమయ్యారు. చాలా ముఖ్యమైన క్యామియో రోల్స్ లో కనిపిస్తారు. అయితే ‘స్పైనల్ మస్కులర్ అట్రోఫీ’ ని సందేశాత్మకంగా చెప్పలేదు. సినిమాటిక్ లిబర్టీ తీసుకొని సినిమాటిక్ గానే చెప్పాం. ఈ సమస్య ఎలా పరిష్కరించాలి? అనే దానికి వెళ్ళలేదు. సినిమా చూసిన ప్రేక్షకులే ఒక ఆలోచనలోకి వస్తారు. చాలా ఆర్గానిక్ గా రాసిన కథ ఇది. అందరికీ కనెక్ట్ అవుతుంది. లార్జర్ దేన్ లైఫ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇందులో ఎక్కువగా నైట్ సీక్వెన్స్ లు వున్నాయి పిస్తుంది ?
-అవునండీ. ఈ కథ దాదాపు డెబ్బై శాతం నైట్ జరుగుతుంది. వెంకటేష్ కి ఇది ముందే చెప్పాను. మొదట.. వెంకటేష్ , పాప, శ్రద్దా శ్రీనాథ్ పాత్రలు ఆసక్తికరంగా పరిచయమవుతూ కథ చాలా హాయిగా మొదలౌతుంది. పదిహేను నిమిషాల తర్వాత ప్రేక్షకులు తల తిప్పుకోలేరు. అంత ఉత్కంఠభరితంగా సాగుతుంది.

ఈ ప్రయాణంలో వెంకటేష్ కి అభిమానిగా మారిపోయినట్లు వున్నారు ?
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాను. నేను మద్రాస్ లో పుట్టా, చిన్నప్పుడు కమల్ హాసన్ సినిమాలు చూశాను. దీంతో ఆయన వర్క్ నాపై ఒక ముద్ర వేసింది. కమల్ హాసన్ హే రామ్ సినిమా చూసిన తర్వాత సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. వెంకటేష్ తో వర్క్ చేయడం మొదలు పెట్టిన తర్వాత ఆయన క్లోజప్పులు, నటన చూస్తుంటే… అద్భుతం అనిపించింది. చిన్నపుడు వెంకటేష్ సినిమాలు చూసుంటే ఆయన కూడా నాపై ప్రభావం చూపేవారు కదా అనిపించింది. అందుకే వెంకటేష్ కి అభిమానిగా మారానని చెప్పాను.

నవాజుద్దిన్ ని తీసుకోవాలనే నిర్ణయం ఎవరిదీ ?
నాదే. ఆ ఆలోచన వెంకటేష్ కి చెబితే బాగా వర్క్ అవుట్ అవుతుందని అన్నారు. తర్వాత నిర్మాత వెంకట్ కి చెప్పి అప్రోచ్ అయ్యాం. ఇందులో నవాజుద్దిన్ పాత్ర చాలా యూనిక్ గా ఉంటుంది. ఇప్పటివరకు ఆయన ఇలాంటి పాత్ర చేయలేదు. ఆయన సౌత్ సినిమాలు పెద్దగా చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. డబ్బింగ్ ఆయనతో చేయించడం లేదనేది ఆయన కారణం. ఇందులో లక్కీగా వచ్చీరాని తెలుగు మాట్లాడే పాత్రని రాసుకున్నాను. ఈ పాత్రకు ఆయన డబ్బింగ్ చెప్పడమే కరెక్ట్. అది ఆయనకు నచ్చింది. చాలా ఆసక్తితో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని డబ్బింగ్ చెప్పారు.

సైంధవ్ లో ‘ఇంద్రప్రస్థ’ సిటీ గురించి చెప్పండి ?
డ్రగ్ కార్టేల్స్, గన్ బిజినెస్..ఇలా పెద్ద స్కేల్ లో ఇందులో కథ జరుగుతుంటుంది. ఈ కథ సముద్రతీరంలో జరగాలి. వైజాగ్ లో ఇంత పెద్ద కార్యకలాపాలు జరుగుతాయంటే నమ్మశక్యంగా ఉండదు. ముంబైలో పెట్టుకుంటే నేటివిటీ పోతుంది. అందుకే ‘ఇంద్రప్రస్థ’ అనే ఫిక్షనల్ టౌన్ ని క్రియేట్ చేశాం.

సైంధవ్ చాలా కాస్ట్లీ సినిమా అనిపిస్తోంది.. నిర్మాత సహకారం గురించి ?
నిర్మాత వెంకట్ మొదటి నుంచి చాలా క్లియర్ గా వున్నారు. ‘నాకు వెంకటేష్ అంటే ఇష్టం. ఆయనకు గొప్ప సినిమా ఇవ్వాలి’’ అని వెంకట్ ముందే చెప్పారు. కావాల్సిన ప్రతిది సమకూర్చారు. ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు.

సైంధవ్ 2 వుంటుందా ?
హిట్ 1 ని ప్రేక్షకులు ఇష్టపడ్డారు కాబట్టి హిట్ 2 తీశాం. సైంధవ్ ని ప్రేక్షకులకు ఇష్టపడితే తప్పకుండా పార్ట్ 2 చేస్తామనే నమ్మకం వుంది. పార్ట్ 2 చేసే అవకాశం వున్న కథ ఇది. ప్రేక్షకులు కోరుకుంటే తప్పకుండా వెంకటేష్ నేను కలిసి సైంధవ్ 2 చేస్తాం.

మీ నుంచి ఒక ప్రేమకథ ఆశించవచ్చా ?
నాకూ చేయాలనే వుంది. నా దగ్గర ఒక మంచి ప్రేమ కథ వుంది. నా లైఫ్ లో జరిగిన సంఘటనలను తీసుకుని ఒక ప్రేమకథని రాశాను. తప్పకుండా ఈ కథని చేస్తాను.

హిట్ 3 గురించి ?
హిట్ 3 రైటింగ్ జరుగుతోంది. అయితే ఆ ఫ్రాంచైజ్ లో వచ్చే సినిమాలకి ఒక మారినేషన్ పీరియడ్ వుండాలనేది మా ఆలోచన. హిట్ 3 రావడానికి ఏడాదిన్నర పడుతుందని భావిస్తున్నాం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Sailesh Kolanu interview
  • Sailesh Kolanu latest interview
  • Sailesh Kolanu news

తాజావార్తలు

  • TPCC Mahesh Goud : డీసీసీ కమిటీలను ప్రకటించిన టీపీసీసీ చీఫ్

  • iPhone 17e.. చౌకగా అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్.. పనితీరు ఎలా ఉందంటే..?

  • Weather Update: బిగ్ అల‌ర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు

  • Unseasonal Rains Damage: అకాల వర్షాలతో భారీ నష్టం.. ఆరు జిల్లాల్లోని 16 మండలాలపై అధిక ప్రభావం

  • Mahindra BE 6 Batman Edition: 999 మంది ఓనర్ల ఆగ్రహం.. మహీంద్రా సరెండర్.. BE 6 బ్యాట్‌మాన్ ఎడిషన్‌కు పూర్తి బైబ్యాక్!

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions