Site icon NTV Telugu

Saif Ali Khan : నాపై దాడి కొందరికి నాటకమైంది.. అసహనం వ్యక్తం చేసిన సైఫ్

Saifalikhan

Saifalikhan

బాలీవుడ్ స్టార్  సైఫ్ అలీఖాన్ ఈ ఏడాది జనవరిలో ఒక దుండగుడి దాడిలో గాయపడ్డ విషయం తెలిసిందే. వారం రోజుల చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు. తాజాగా, ఈ ఘటన గురించి ఓ టాక్‌ షోలో సైఫ్ స్పందిస్తూ.. ‘కొందరు ఈ దాడిని నాటకంగా చూపారని, నిజానికి ఈ సమస్య సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం అని అన్నారు. “ఇలాంటి సమాజంలో మనం జీవిస్తున్నాం, ఇలాంటి సందర్భంలో కొందరు నిజాన్ని అర్థం చేసుకోరు” అని ఆయన అన్నారు.

Also Read : Santosh: ఇండియాలో బ్యాన్‌.. కానీ కేన్స్, ఆస్కార్‌ల దాకా దూసుకెళ్లిన క్రైమ్ మూవీ.. OTT రిలీజ్ డేట్ ఫిక్స్..

అలాగే ‘ఆసుపత్రి నుండి డిశ్చార్జ్‌ అయినప్పుడు నడిచేలా బయటకు వచ్చి, ఇంటికి వెళ్లడం పెద్ద సంచలనంగా మారింది. మీడియా, అభిమానులు ఆయన కోసం ఎదురుచూస్తుండగా, అంబులెన్స్ లేదా వీల్‌చేర్‌లో బయటకు వస్తే నాకు తీవ్రంగా గాయాలయ్యాయని అని అనుకుంటారు..నేను బాగానే ఉన్నానని చూపించడానికి, నడిచి వచ్చా . కానీ కొందరు దాన్ని తప్పుగా అర్థం చేసుకుని ‘ అసలు ఎలాంటి దాడి జరగలేదు, ఇది నాటకం’ అని ప్రచారం చేశారు. నిజానికి నా పరిస్థితి, గాయాలు నిజం” అని సైఫ్ అన్నారు.

ఇక జనవరి 16న జరిగిన ఈ దాడి పై ముంబయి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసులు బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ను అరెస్ట్ చేశారు. అతను రూ.30 వేల కోసం సైఫ్‌పై దాడి చేశాడని విచారణలో వెల్లడించారు. ఈ ఘటన సైఫ్ జీవితంలో సీరియస్‌ అనుభవంగా మారింది, అలాగే సమాజంలో అభిమానులు, మీడియా ఎలా స్పందిస్తారో కూడా నాకు ఒక అనుభవం అయింది.

Exit mobile version