Site icon NTV Telugu

Saif Ali Khan: కరీనాతో స్క్రీన్ షేర్‌పై సైఫ్ షాకింగ్ కామెంట్స్..

Saifalikhan Karina

Saifalikhan Karina

బాలీవుడ్ స్టార్ హీరోలో సైఫ్ అలీఖాన్ ఒకరు. హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆయన ప్రజంట్ బాషతో సంబంధం లేకుండా విలన్‌గా ధూసుకుపొతున్నారు. అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వృత్తిపరమైన అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు సైఫ్. 90ల కాలంలో నాకు ఎక్కువ అవకాశాలు రావడం నా అదృష్టమని ప్రేక్షకులు తరచూ అనేవారు. కానీ బలమైన స్క్రిప్ట్‌లు, ప్రధాన పాత్రలు రావడం లేదని నాకు అనిపించేది  అని తెలిపాడు. అలాగే జీవిత భాగస్వామి లేదా స్నేహితులతో పనిచేయడం వృత్తిపరంగా సులభంగా కనిపించినా, అది ఎల్లప్పుడూ సరైనదే కాదు అని సైఫ్ అన్నారు.

Also Read : Mahesh Babu : AMB క్లాసిక్ మల్టీప్లెక్స్ ఓపెనింగ్ కు ముహుర్తం ఫిక్స్ !

‘నా  భార్య కరీనా కపూర్‌తో ‘ఎల్‌వోసీ కార్గిల్’, ‘ఓంకార’, ‘ఏజెంట్ వినోద్’ వంటి సినిమాల్లో కలిసి నటించాను. అయి కూడా నా అభిప్రాయాన్ని మార్చుకోలేదు’ అని అన్నారు. అంటే సైఫ్ చెప్పనదాన్ని ప్రకారం, వృత్తి పరంగా ఎదుగుదలకు, కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి వ్యక్తిగత బంధాలను వృత్తిలో ఎక్కువగా కలపకూడదు. ఎందుకంటే, వ్యక్తిగత సంబంధాలను ప్రోఫేషనల్‌లో కలపడం వల్ల సవాళ్లను ఎదుర్కోవడం తగ్గిపోతుంది అని ఆయన అభిప్రాయం.

Exit mobile version