NTV Telugu Site icon

Saif Ali Khan: సైఫ్ మొదటి భార్య ఎవరు, విడాకుల తర్వాత అతను ఎన్ని కోట్లు చెల్లించాడో తెలుసా??

Amritha Singh

Amritha Singh

నటుడు సైఫ్ అలీ ఖాన్ ఆసుపత్రిలో చేరారు. బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగుడు కత్తితో దాడి చేసి గాయపరచగా తీవ్ర గాయాలు కావడంతో విజయవంతంగా ఆపరేషన్ జరిగింది. ఇదిలా ఉంటే సైఫ్ అలీఖాన్ సినిమా కెరీర్, వ్యక్తిగత జీవితంపై కూడా చర్చ జరుగుతోంది. అయితే అతని మొదటి భార్య గురించి తెలుసుకుందాం. సైఫ్ అలీ ఖాన్ రెండుసార్లు వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత, సైఫ్ తన మొదటి భార్యకు మంచి మొత్తం చెల్లించాల్సి వచ్చింది. అమృతా సింగ్‌ను సైఫ్ అలీఖాన్ మొదటి వివాహం చేసుకున్నారు . వారిద్దరూ 1991లో పెళ్లి చేసుకున్నారు. అమృతా సింగ్ కూడా ప్రముఖ నటి. 80 -90లలో ఆమె సినిమాలు చేసింది. సైఫ్‌కి, ఆమెకి మధ్య చాలా వయసు తేడా ఉంది. కానీ ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకునే సరికి వయో పరిమితి అడ్డు రాలేదు. వారిద్దరి మధ్య దాదాపు పన్నెండు-పదమూడేళ్ల వయస్సు వ్యత్యాసం ఉంది. వారి వివాహం తరువాత, ఇద్దరు పిల్లలు – సారా అలీ ఖాన్ మరియు ఇబ్రహీం అలీ ఖాన్ జన్మించారు.

Daya Nayak: ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ ఎవరు..? సైఫ్ అలీ ఖాన్ కేసులో దర్యాప్తు..

‘బేఖుడి’ సినిమా సమయంలో సైఫ్ మరియు కరీనా బేఖుడి సెట్స్‌లో కలుసుకున్నారు. ఇద్దరికీ మొదటి చూపులో ప్రేమ కలగలేదు కానీ నెమ్మదిగా ప్రేమ కలిగింది. ఇద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సైఫ్, అమృతల వైవాహిక జీవితం చాలా బాగా సాగింది. ఇటాలియన్ మోడల్ రోసా సైఫ్ జీవితంలోకి రావడం వారి విడాకులకు కారణమైంది. సైఫ్ ముంబైలో రోసాతో కలిసి జీవించడం ప్రారంభించడంతో అమృత, సైఫ్ మధ్య దూరం పెరగడం మొదలైంది. ఆ తర్వాత అమృత ఇదంతా తట్టుకోలేక 2004లో సైఫ్‌తో విడాకులు తీసుకుంది. అయితే రోసాతో సైఫ్ రిలేషన్ షిప్ కు త్వరలోనే తెరపడింది. తరువాత, కరీనా సైఫ్ జీవితంలోకి ప్రవేశించింది. వారిద్దరూ 2012లో పెళ్లి చేసుకున్నారు. విడాకుల తర్వాత అమృతకు సైఫ్ అలీఖాన్ కోట్ల రూపాయల భరణం ఇచ్చాడు . సైఫ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘విడాకుల కోసం అమృత నన్ను రూ. 5 కోట్లు డిమాండ్ చేసింది. అమృతకు రూ.2.5 కోట్లు ఇచ్చా, మిగిలిన మొత్తాన్ని కొద్దికొద్దిగా అమృతకి ఇస్తున్నాను. ఇది కాకుండా కొడుకు ఇబ్రహీంకు 18 ఏళ్లు వచ్చే వరకు ప్రతి నెలా అమృతకు రూ.లక్ష ఇస్తూనే ఉంటా. నేను షారుక్‌ ఖాన్‌ని కాదు. నా దగ్గర అంత డబ్బు లేదు. మిగిలిన డబ్బు ఇస్తానని, చేస్తానని వాగ్దానం చేశా అని చెప్పుకొచ్చారు.

Show comments