Site icon NTV Telugu

ఓటీటీలోకి వస్తున్న సాయిధరమ్‌తేజ్ ‘రిపబ్లిక్’

మెగా హీరో సాయిధరమ్‌తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన తర్వాత విడుదలైన సినిమా ‘రిపబ్లిక్’. దీంతో ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఈ మూవీ కోసం మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రమోషన్‌లు నిర్వహించారు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలను అందుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం చూపించలేదు.

Read Also: 1000వ ఎపిసోడ్‌కు చేరుకోనున్న జీ తెలుగు సీరియల్

అయితే అక్టోబర్ 1న థియేటర్లలో విడుదలైన ‘రిపబ్లిక్’ మూవీ త్వరలోనే ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు స్ట్రీమింగ్ తేదీని జీ5 సంస్థ ప్రకటించింది. నవంబర్ 26 నుంచి రిపబ్లిక్ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. ఐశ్వర్య రాజేష్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీని జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మించారు. ప్రస్థానం ఫేం దేవ్‌కట్టా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూర్చాడు. రూ.12.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ రూ.6.85 కోట్లను మాత్రమే రాబట్టింది.

Exit mobile version