Site icon NTV Telugu

Mystic thriller: బాగా శ్రమపడుతున్న సాయి తేజ్ మూవీ టీమ్!

New Project

New Project

 

గత యేడాది సీరియస్‌ యాక్సిడెంట్‌ని ఫేస్‌ చేసిన సాయి తేజ్‌ మెల్లిమెల్లిగా కోలుకున్నారు. రికవరీ మోడ్‌లో కొన్నాళ్ల పాటు ఆయన బ్రేక్‌ తీసుకున్నారు. పూర్తిగా కోలుకున్నాక షూటింగ్‌ సెట్స్ కి హాజరవుతున్నారు. రీఎంట్రీలో ఆయనకు సెట్స్ లో గ్రాండ్‌ వెల్‌కమ్‌ అందింది. ప్రస్తుతం కార్తిక్‌ దండు డైరక్షన్‌లో సాయితేజ్ సినిమా చేస్తున్నారు.

స్టార్‌ ప్రొడ్యూసర్‌ బీవీయస్‌యన్‌ ప్రసాద్‌, క్రియేటివ్‌ డైరక్టర్‌ సుకుమార్‌ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శామ్‌దత్‌ షైనుద్దీన్‌ ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్‌. మెగాఫ్యాన్స్ కోసం మేకర్స్ బిహైండ్‌ ద సీన్స్ పిక్చర్‌ను సోమవారం ట్వీట్ చేశారు. లైట్‌, షాడో మధ్య కనిపిస్తోందీ పిక్చర్‌. డీప్‌ షాడోస్‌లో మేకర్స్ ఫ్రేమ్‌ పెట్టినట్టు అర్థమవుతోంది. 25 రోజుల్లో 30 శాతం సినిమా షూటింగ్‌ పూర్తయిందని, క్యూరియాసిటీ పెంచే మిస్టిక్‌ థ్రిల్లర్‌ ఇదని నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్ తెలిపారు. వరుస చావులకు కారణం తెలుసుకోవడానికి ఓ విలేజ్‌కి వెళ్లిన హీరోకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయన్నదే ఈ చిత్రకథ. బ్లాక్‌ మ్యాజిక్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది

Exit mobile version