Site icon NTV Telugu

సాయి పల్లవి సోదరి పూజ తొలి చిత్రం ఫస్ట్ లుక్

Pooja-Kannan

Pooja-Kannan

నటి సాయి పల్లవి సోదరి పూజా కన్నన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. పూజ నటించిన మలయాళ సినిమా ‘చిత్తిరై సెవ్వానం’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. ఇందులో పూజ సముద్రఖని కూతురిగా కీలక పాత్రలో కనిపించనుంది. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ సిల్వా దర్శకత్వం వహిస్తున్నాడు. పోస్టర్‌ చూసిన వారిలో చాలా మంది పూజను సాయిపల్లవిగా భావిస్తుండటం విశేషం. నిజజీవితంలో కూడా వీరిద్దని పలువురు కవలలుగా భావిస్తుంటారు.

Read Also : దుబాయ్ లో బన్నీ, ప్యారిస్ లో జూనియర్

పూజా గతంలో దర్శకుడు ఏఎల్ విజయ్ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్ గా పని చేసింది. ఆ తర్వాత ‘కార’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించటంతో ఇప్పుడు ఏకంగా సినిమాలో యాక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసింది. పూజ నటించిన ‘చిత్తిరై సెవ్వానం’ సినిమా డిసెంబర్ 3న జీ 5 లో ప్రీమియర్ కానుంది. మరి నటిగా పూజ ఎలాంటి నటనను కనపరిచింది? సాయిపల్లవి స్థాయి నటను ప్రదర్శించగలదా? లేదా అన్నది తేలాలంటే డిసెంబర్ 3 వరకూ ఆగాల్సిందే.

Exit mobile version