దుబాయ్ లో బన్నీ, ప్యారిస్ లో జూనియర్

మన స్టార్ హీరోలు ఎన్టీఆర్, బన్నీ కుటుంబ సభ్యలుతో కలసి విదేశాలలో ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ తన భార్య ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ తో కలసి ప్యారిస్ వీధులు చుట్టేస్తుండగా బన్నీ భార్య స్నేహ, పిల్లలు అయాన్, అర్హతో దుబాయ్ వీధుల్లో సంచరిస్తున్నాడు. షూటింగ్ లతో బిజీగా ఉండే వీరిద్దరూ కుబుంబం కోసం సమయం వచ్చించి ఆ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేయటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తి చేసిన ఎన్టీఆర్ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఈఫిల్ టవర్ బ్యాక్ డ్రాప్ లో పెద్ద కొడుకు అభయ్ రామ్ ని ముద్దుపెట్టుకుంటున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఎయిర్ పోర్ట్ లో ఫ్యామిలీతో కలసి ప్యారిస్ విమానం ఎక్కబోతున్న సందర్భంగా తీసిన పిక్స్ కూడా ఫ్యాన్స్ తెగ షేర్ చేసుకుంటున్నారు. యూరప్ ట్రిప్ ముగిసిన తర్వాత ఎన్టీఆర్ మళ్ళీ ‘ఆర్ఆర్ఆర్’ ప్రచారంలో ముమ్మరంగా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ రియాలిటీ గేమ్ షో షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న తారక్ జనవరి నెలాఖరు నుంచి కొరటాల శివ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.

Image

Read Also : వెంకీ కుడుములకు దానయ్య మెగా ఛాన్స్

ఇదిలా ఉంటే తన కుమార్తె అల్లు అర్హ పుట్టిన రోజు వేడుకను బన్నీ దుబాయ్ లోని ‘బుర్జ్ ఖలీపా’ టవర్ లో ఘనంగా జరిపాడు. ఈ పార్టీకోసం బుర్జ్ ఖలీఫా, ఎమ్మార్ ప్రాపర్టీ యజమానులు టాప్ లెవెల్ టవర్ ను ప్రత్యేకంగా కేటాయించటం విశేషం. నిజానికి ఇది సాధారణ ప్రజల కోసం తెరవరు. బుర్జ్ ఖలీఫాలోని ఈ అంతస్తులో పుట్టినరోజు పార్టీ నిర్వహించడం ఇదే మొదటిసారి. ఇక ఇటీవల ‘పుష్ప’ సినిమా పార్ట్ వన్ షూటింగ్ పూర్తి చేసిన అల్లు అర్జున ఈ టూర్ తర్వాత సెకండ్ పార్ట్ షూటింగ్ లో పాల్గొంటాడా? లేక బోయపాటితో సొంత సినిమా షూటింగ్ మొదలు పెడతాడా? అన్నది తేలాల్సి ఉంది. మరి అటు ఎన్టీఆర్, ఇటు బన్నీ తమ తమ సినిమాలతో విజయం సాధించాలని కోరుకుందాం.

దుబాయ్ లో బన్నీ, ప్యారిస్ లో జూనియర్

Related Articles

Latest Articles