‘ఫిదా’ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన బ్యూటీ సాయి పల్లవి. ఈచిత్రం తరువాత వరుస అవకాశాలను అందుకోవడమే కాకుండా భారీ విజయాలను అందుకొని స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక వ్యక్తిగతంగా కూడా తన వ్యక్తిత్వంతో ఎంతోమంది మనసులను గెలుచుకున్న సాయి పల్లవి ప్రస్తుతం ‘విరాటపర్వం’ ప్రమోషన్స్ లో బిజీగా మారింది. రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంల తెరకెక్కిన ఈ సినిమా జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో సాయి పల్లవి వరుస ఇంటర్వ్యూలలో పాల్గొని ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంది. తాజాగా తన స్టార్ స్టేటస్ గురించి ఆసక్తికరమైన ఆన్సర్ చెప్పి హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పుడు సూపర్ స్టార్ గా ఎదిగారు.. ఒకప్పుడు మీరు డాన్సర్.. అప్పటికీ, ఇప్పటికీ తేడా ఏంటి..? మీలో ఏమైనా మార్పు వచ్చిందా..? అన్న ప్రశ్నకు సాయి పల్లవి మాట్లాడుతూ “నేను సూపర్ స్టార్ అని అనుకోను.. నేను అలా బిహేవ్ చేయను.. నేను మొదట్లో ఢీ షో చేసేటప్పుడు.. కొంతమంది పెద్దవాళ్లు నన్ను చూసి ఈ అమ్మాయి ఢీ షోలో చేస్తుంది కదా అంటూ నన్ను గుర్తుపట్టేవారు.. అప్పుడు నాకు సంతోషం అనిపించింది.. ఆ తరువాత ‘ప్రేమమ్’ లో చూసి నన్ను వారి ఇంట్లో అమ్మాయిలా అనుకున్నారు.. నాకు ఏంటంటే.. నన్ను చూసినప్పుడు.. ఇది మా పిల్ల.. మా అమ్మాయిల ఉంది.. మా చెల్లిలా ఉంది.. అంటే అదే నాకు బ్లెస్సింగ్ లా ఉంటుంది.. అంతకంటే నేను ఏమి కోరుకోను.. అది దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటా.. దానికి దర్శకులకు థాంక్స్ చెప్పాలి.. నాకు అలాంటి పాత్రలు ఇస్తున్నందుకు. ఇంకా నా తల్లిదండ్రులకు థాంక్స్ చెప్పాలి.. జీవితంలో ఏది ముఖ్యమో నాకు నేర్పించినందుకు ” అని చెప్పుకొచ్చింది. ప్రస్తతం ఈ సాయి పల్లవి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
