NTV Telugu Site icon

Sai Pallavi: ఆ పని చేస్తే సాయి పల్లవికి కోపం కట్టలు తెంచుకుంటుందట

Sai Pallavi

Sai Pallavi

Sai Pallavi: స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇక నిన్ననే ఆమె నటించి గార్గి చిత్రం విడుదలై పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తోంది. ప్రాధాన్యత ఉన్న సినిమాలే తప్ప గ్లామర్ రోల్స్ కు నో చెప్పే ఈ భామ ప్రస్తుతం శివ కార్తికేయన్ సరసన ఒక తమిళ్ సినిమాలో నటిస్తోంది. ఇక సాయి పల్లవి వ్యక్తిత్వం గురించి కూడా అభిమానులుకు చాలా బాగా తెలుసు. ఆమె చాలా సెన్సిటివ్.. ఎదుటి వాళ్ళను హర్ట్ చేసే మనస్తత్వం ఆమెది కాదని, సాయి పల్లవికి అసలు కోపమే రాదని ఆమె అభిమానులు చెప్తూ ఉంటారు. అయితే సాయి పల్లవికి కూడా కోపం వస్తుందట.. అది కూడా మాములు కోపం కాదు.. కట్టలు తెంచుకొనేలా కోపం వస్తుందని ఆమె చెప్పుకొచ్చింది. అలాంటి కోపం ఎప్పుడు వస్తుంది అంటే.. ఎవరైనా ఆమె గాఢ నిద్రలో ఉన్నప్పుడు లేపితే కోపం కట్టలు తెంచుకుంటుంది అంట.. ఈ విషయాన్ని సాయి పల్లవి గార్గి మూవీ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చింది.

మీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా అంటే సాయి పల్లవి మాట్లాడుతూ “నాకు అంత త్వరగా కోపం రాదు.. కానీ నేను నిద్రపోయినప్పుడు ఎవరైనా కదిలించినా.. లేపడానికి ప్రయత్నించినా చాలా కోపం వస్తుంది.. ఆ సమయంలో నేను ఏం చేస్తానో నాకే తెలియదు” అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తాను సంపాదించినా డబ్బును ఎక్కువ ఖర్చు పెట్టనని, షాపింగ్స్ కు వెళ్ళినప్పుడు స్నేహితులు ఏదైనా బావుంది అంటే వారికి కొని ఇచ్చేస్తానని చెప్పుకొచ్చింది. మరి సాయి పల్లవికి ఇంట్లో అంతలా కోపం తెప్పించేవారు ఎవరుంటారు..? అని అభిమానులు ఆరా తీస్తున్నారు.