Site icon NTV Telugu

సాయి పల్లవి షాకింగ్ డెసిషన్ !

Sai Pallavi takes a shocking career decision

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి షాకింగ్ డెసిషన్ తీసుకుంది. సినిమాల ఎంపిక విషయంలో ఎంతో జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేసే ఈ బ్యూటీ కెరీర్ విషయంలోనూ తనకు నచ్చినట్టుగానే ముందుకు వెళ్తా అంటుంది. ప్రస్తుతం సాయి పల్లవి ‘లవ్ స్టోరీ’ సక్సెస్ ను ఆస్వాదిస్తోంది. మిగతా హీరోయిన్లకు భిన్నంగా గ్లామర్ ను పక్కన పెట్టి మంచి పాత్రలను ఎన్నుకునే సాయి పల్లవికి సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. రొమాంటిక్ మూవీ ‘ప్రేమమ్’లో మలార్ మిస్ గా కన్పించి, మొదటిసారే తన తొలి చిత్రం ద్వారా ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. జార్జియాలోని ఓ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలైన సాయి పల్లవి ఇప్పుడు డాక్టర్‌గా సేవలు అందించబోతోంది. టిబిలిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుండి పట్టభద్రురాలైంది. ప్రస్తుతం ఆమె శిక్షణ పొందిన డాక్టర్.

Read Also : ప్రభాస్ సరసన ‘ఖిలాడీ’ భామ

ఇటీవల జరిగిన మీడియా ఇంటరాక్షన్ సమయంలో సాయి పల్లవి మాట్లాడుతూ తన చుట్టూ ఉన్న వ్యక్తులకు సహాయం చేయడానికి డాక్టర్ వృత్తిని చేపట్టాలనుకుంటున్నట్లు చెప్పింది. అయితే తనకు ఛాలెంజింగ్ రోల్స్ వస్తే సినిమాల్లో కూడా నటిస్తానని చెప్పింది. ప్రస్తుతం సాయి పల్లవి ‘శ్యామ్ సింగ రాయ్‌’లో నానితో స్క్రీన్ స్పేస్‌ను పంచుకుంటుంది.

Exit mobile version