ప్రభాస్ సరసన ‘ఖిలాడీ’ భామ

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో కలిసి చేస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’. శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న భారీ హైపర్ యాక్షన్ డ్రామా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటోంది. భారీ గ్యాంగ్ స్టర్ మూవీ “సలార్”లో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నటుడు జగపతిబాబు “సలార్”లో కీలక పాత్రలో కనిపించనున్నాడు. తాజా అప్‌డేట్ ప్రకారం ‘సలార్’లో మరో హీరోయిన్ కూడా నటించబోతోందని సమాచారం. మీనాక్షి చౌదరి అనే హీరోయిన్ ‘సలార్’లో రెండవ హీరోయిన్ గా నటిస్తోంది. మీనాక్షి చౌదరి ఇప్పటికే సుశాంత్ తో కలిసి ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాలో కన్పించింది. ప్రస్తుతం ఆమె రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఖిలాడీ’ అనే యాక్షన్ డ్రామాలో మాస్ మహారాజా రవితేజతో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. మొదటి సినిమా పెద్దగా పేరు తీసుకురాకపోయినా వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది ఈ బ్యూటీ. ఇప్పుడు ప్రభాస్ సినిమాలో ఛాన్స్ పట్టేసిన మీనాక్షి ‘హిట్ 2’లో కూడా అవకాశం దక్కించుకుంది.

Rea Also : ‘గాడ్ ఫాదర్’ మ్యూజిక్ సెషన్ స్టార్ట్

ఇక ‘సలార్’ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగండూర్ నిర్మించారు. కన్నడ, తెలుగు భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడిన ఈ చిత్రం హిందీ, తమిళం, మలయాళంలో కూడా డబ్ చేయబడుతుంది. రవి బస్రూర్ సంగీతం సమకూర్చగా, సినిమాటోగ్రఫీ భువన్ గౌడ నిర్వహిస్తున్నారు. “సలార్” 14 ఏప్రిల్ 2022న గ్రాండ్ రిలీజ్ కానుంది. మరోవైపు ప్రభాస్ బాలీవుడ్ నటి దీపికా పదుకొనేతో పాటుగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించే ‘ప్రాజెక్ట్ కె’లో నటిస్తున్నారు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ‘రాధే శ్యామ్’ వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది.

-Advertisement-ప్రభాస్ సరసన 'ఖిలాడీ' భామ

Related Articles

Latest Articles