NTV Telugu Site icon

Sai Pallavi: ఓవర్‌థింకింగ్‌ వల్ల నా ఆలోచన ఎక్కడికో వెళ్లిపోతుంది: సాయి పల్లవి

Untitled Design (22)

Untitled Design (22)

సౌత్‌లో లేడి పరర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నెచురల్ బ్యూటి సాయి పల్లవి గురించి ఎంత మాట్లాడుతున్న తక్కువే అవుతుంది. అనతి కాలంలోనే తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. సినిమా ఎంపికలో చాలా సెలెక్టివ్‌గా ఉండే ఆమె తాను పోషించే ప్రతి పాత్రకు పరిపూర్ణంగా న్యాయం చేస్తుంది. అందుకే ఆమె ఓ సినిమాకు ఒప్పుకుందంటే అందులో మంచి కంటెంట్‌ ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు. ఇక గత ఏడాది ‘అమరన్‌’తో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సాయి పల్లవి ప్రస్తుతం ‘తండేల్‌’, ‘కుబేర’ చిత్రాల్లో నటిస్తున్నది. అంతే కాదు.. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తూ రణబీర్‌కపూర్‌ సరసన ‘రామాయణ’ చిత్రంలో సీత పాత్ర పోషిస్తుందట. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది..

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి. ‘పబ్లిక్‌ ప్లేస్‌లోకి వెళ్లినప్పుడు అందరూ ననే చూస్తుంటారు. అప్పుడు కాస్త భయంగానూ, బిడియంగానూ ఉంటుంది. ఎవరైనా అభినందించినా కూడా తెలియని టెన్షన్‌ . అన్నింటికంటే ముఖ్యంగా నా అనుమతి లేకుండా ఎవరైనా ఫోటోలు తీస్తే అస్సలు నచ్చదు, అడిగి తీసుకుంటే బాగుంటుంది కదా. ఒక్కోసారి ఓవర్‌థింకింగ్‌ వల్ల ఆలోచనలు ఎక్కడికో వెళ్లిపోతాయి, వాటిని నియంత్రించుకోవడానికి నిత్యం ధ్యానం చేస్తాను’ అని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. అంతే కాదు ఎవరైనా మీద మీదకు వచ్చి సెల్ఫీ తీసుకున్న చాలా భయంగా ఉంటుందట తనకు. అందుకే ఎక్కువగా ప్రేక్షకుల మద్యలోకి వెళ్లడానికి నిరాకరిస్తాడు.