నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి పరిచయం అక్కర్లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. సినిమాల ఎంపిక విషయంలో సాయిపల్లవి చాలా సెలెక్టివ్‌గా ఉంటుంది. కథలో కొత్తదనంతో పాటు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటే తప్ప అంగీకరించదు. అందుకే ఆమె సినిమాలపై ప్రేక్షకులు ఎంతో ఆసక్తి కనబరుస్తారు.
రీసెంట్‌గా ‘అమరన్’ మూవీ హిట్‌తో ఫుల్ జోష్ మీదున్న ఈ ముద్దుగుమ్మ మరో తెలుగు సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ‘బలగం’ మూవీ తో దర్శకుడిగా మంచి హిట్ అందుకున్న వేణు ‘ఎల్లమ్మ’ అనే మూవీతో రాబోతున్నాడు. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాత. ఇందులో కథానాయిక పాత్ర చాలా కీలకంగా ఉంటుందట అందుకే సాయి పల్లవి ని హీరోయిన్ గా ఎంచుకునరట. కథ నచ్చడంతో ఈ ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే సాయిపల్లవికి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తన తదుపరి చిత్రని డైరెక్టర్ మడోన్ అశ్విన్ దర్శకత్వంలో నటించనున్నారు. అయితే విక్రమ్ కి జోడిగా సాయి పల్లవి ని ఎంపిక చేసిందట చిత్ర యూనిట్. కానీ ఆ డేట్స్‌కి కాల్షీట్ లేకపోవడంతో ఆ సినిమాలో నటించే అవకాశాన్ని వదులుకుందట సాయి పల్లవి. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలవగా, నటీనటుల కోసం వెతుకుతున్నారు.