NTV Telugu Site icon

Sai Pallavi: పుట్టినరోజు నాడు స్పెషల్ అప్డేట్ ఇచ్చిన స్టార్ హీరోయిన్

Sai Pallavi

Sai Pallavi

ఫిదా చిత్రంతో తెలుగు వారి గుండెల్లో హైబ్రిడ్ పిల్లగా ముద్ర వేసింది సాయి పల్లవి. ముఖం నిండా మొటిమలు, గ్లామర్ పాత్రలకు నో చెప్పడం, హీరోలతో ఇగో క్లాష్ లు ఇలా తన వ్యక్తిత్వాన్ని ఎవరి కోసం మార్చుకోకుండా తన క్యారెక్టర్ తో ఇంకో మెట్టు ఎక్కి స్టార్ హీరోయిన్ గానే కాకుండా విలువలు గల హీరోయిన్ గా అందరిచేత శభాష్ అనిపించుకుంటున్న ఈ బ్యూటీ నేడు తన 29 వ పుట్టినరోజును ఘనంగా జరుపుకొంటుంది. ఈ సందర్భంగా ఆమె తన కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించిన  అప్డేట్ ను తెలిపింది. గతేడాది శ్యామ్ సింగ్ రాయ్ చిత్రంతో హిట్  అందుకున్న ఈ భామ ఇప్పటివరకు ఏ సినిమా సైన్ చేయలేదని, ఆమెకు పెళ్లికి రెడీ అయ్యిందంటూ వార్తలు  గుప్పుమంటున్న వేళ.. నేడు ఆ వార్తలకు చెక్  పెడుతూ కొత్త సినిమా అప్డేట్ ను తెలిపింది. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గార్గి’. బ్లాకీ జనీ బ్యానర్ పై రవి చంద్రన్ రామచంద్రన్ – ఐశ్వర్య లక్ష్మీ – థామస్ జార్జ్ – గౌతమ్ రామచంద్రన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక నేడు సాయి పల్లవి పుట్టినరోజును పురష్కరించుకొని ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్.. ఈ వీడియోలో సాయి పల్లవి సాంప్రదయకంగా చీరకట్టుతో కనిపించింది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆడపిల్లలను చులకనగా చూసే సమాజంలో ఒక ఆడపిల్ల.. తన హక్కుల కోసం పోరాటం చేసే కథగా ఈ సినిమా తెరక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వీడియో లో  ‘నువ్వు టైమ్,  రాత,  విధి.. అన్నిటినీ నమ్ముతావమ్మా. కానీ నన్ను మాత్రం నమ్మవు. ఎందుకంటే నేను మగపిల్లాడిని కాదుగా ఆడపిల్లను’ అని  సాయి పల్లవి చెప్పే డైలాగ్ తో ఈ సినిమా కథ ఎంతో సున్నితంగా ఉండబోతుందని అర్ధమవుతుంది. ఇక గోవింద్ వసంత సంగీతం సినిమాకు హైలైట్ గా నిలవనుందని తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు మేకర్స్ తెలిపారు.

Show comments