Sai Pallavi Dance at Pooja Kannan Engagement goes viral: తెలుగమ్మాయి కాకున్నా సాయి పల్లవికి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిజానికి ఒకప్పుడు మన ఢీ ప్రోగ్రామ్స్ లో కంటెస్టెంట్ అయిన ఆమె మలయాళ ప్రేమమ్ సినిమాతో స్టార్ క్రేజ్ అందుకుంది. ఆ తర్వాత ఆమె తెలుగులో ఫిదా అనే సినిమాతో పరిచయమై ఇక్కడి వారికి కూడా బాగా దగ్గరైంది. ఇక ఆమె అందం, అభినయంతో పాటు డ్యాన్స్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. అలాంటి ఆమె తన చెల్లి పెళ్లి వేడుక అంటే సాయి పల్లవి డ్యాన్స్ చేయకుండా ఉంటుందా? కచ్చితంగా చేస్తుంది, అలాగే చేసింది. ఈ క్రమంలో ఆమె సంతోషంగా డ్యాన్స్ చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ కూడా ఒక సినిమాలో నటించింది.
Tollywood Sequels: తెలుగులో అనౌన్స్ చేసిన ఆసక్తికర 20 సీక్వెల్ సినిమాలు ఇవే
కానీ ఎందుకో ఆ తరువాత ఎలాంటి ప్రాజెక్ట్ ఆమె ఒప్పుకోలేదు. ఇక చాలాకాలంగా వినీత్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్న పూజ తమ పెళ్లి కోసం పెద్దలను ఒప్పించారు. ఇక తాజాగా తన ప్రేమ, పెళ్లి విషయాన్ని అధికారికంగా తన సోషల్ మీడియాలో కూడా ప్రకటించింది . ఇక ఆదివారం నాడు వారికి నిశ్చితార్ధం జరిగింది. ఆ సమయంలో సాయి పల్లవి ఆనందంతో తన చెల్లెలు కొంతమంది బంధువులతో కలిసి డాన్స్ చేసింది. ఇక ఆమె అలా చేసిన డ్యాన్స్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పూజ నిశ్చితార్థపు ఫోటోలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే వీరి పెళ్లి ఎప్పుడు? ఏమిటి? అనే విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. ఇంకెందుకు ఆలస్యం సాయి పల్లవి డ్యాన్స్ మీద మీరు కూడా ఒక లుక్ వేసేయండి మరి.
#SaiPallavi Vera Level Dance in Her sister's engagement Function 🎊🎉🎇❤ pic.twitter.com/poJ7UjM4uU
— Manjari (@mazhil11) January 22, 2024