NTV Telugu Site icon

Sai Pallavi: ముంబైలో మెరిసిన ఎర్ర గులాబీ…

Sai Pallavi

Sai Pallavi

లేడీ పవర్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది హీరోయిన్ ‘సాయి పల్లవి’. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఫిదా సినిమాతో తెలుగు తెరపై మెరసిన సాయి పల్లవికి ఫస్ట్ సినిమాతో సూపర్బ్ ఫేమ్ వచ్చింది. డెబ్యుతోనే స్టార్ హీరోయిన్ అనిపించుకున్న సాయి పల్లవి, తన యాక్టింగ్ స్కిల్స్ తో ప్రతి ఒక్కరినీ కట్టిపడేసింది. సాయి పల్లవి ఫిల్మోగ్రఫీలోని లవ్ స్టొరీ, శ్యాం సింగ రాయ్, విరాట పర్వం లాంటి సినిమాల పేర్లు చూస్తే ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్ ఇంత పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న రోల్స్ పడలేదు అంటే అతిశయోక్తి కాదు. చీర కట్టులో కూడా మోస్ట్ గ్లామరస్ గా కనిపించగల సాయి పల్లవికి తెలుగు రాష్ట్రాల్లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆమెని చూడడానికే ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్తున్నారు అంటే సాయి పల్లవి క్రేజ్ ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం సినిమాలకి కాస్త దూరంగా ఉన్న సాయి పల్లవి, గత రాత్రి నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది.

ఇందుకు కారణం సాయి పల్లవి, తన ట్రేడ్ మార్క్ లాంటి రెడ్ సారీలో కనిపించడమే. ముంబైలో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ ఫంక్షన్ లో సాయి పల్లవి తళుక్కున మెరసింది. గతేడాది రిలీజ్ అయిన ‘గార్గీ’ సినిమాకి గాను సాయి పల్లవికి ‘బెస్ట్ హీరోయిన్’ అవార్డ్ వచ్చింది. ఈ అవార్డ్ ని అందుకోవడానికి సాయి పల్లవి ముంబై వెళ్లింది. ఈ సంధర్భంగా రెడ్ సారీలో కనిపించిన సాయి పల్లవిని కెమెరాలు బంధించాయి. అంతే సాయి పల్లవి కొత్త ఫోటోలు ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్నాయి. లాస్ట్ ఇయర్ నుంచి సినిమాలని సైన్ చెయ్యకుండా సైలెంట్ గా ఉన్నా సాయి పల్లవి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అనడానికి ట్విట్టర్ లో అవుతున్న ట్రెండే ఉదాహరణ. అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమాలో సాయి పల్లవి నటిస్తుంది, ఈ పాన్ ఇండియా సినిమా కోసం పడి రోజుల కాల్ షీట్స్ కూడా కేటాయించింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి.

Show comments