NTV Telugu Site icon

Virupaksha: ఇక వెయిటింగ్ లేదు మిత్రమా… అప్డేట్ లు మాత్రమే…

Virupaksha

Virupaksha

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కొంచెం గ్యాప్ తీసుకోని చేస్తున్న సినిమా ‘విరూపాక్ష’. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్నాడు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్, SVCC కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21న ఆడియన్స్ ముందుకి రానుంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ మూవీ గ్లిమ్ప్స్ ని ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చి ఎలివేట్ చేశాడు. మంచి బజ్ క్రియేట్ చేసిన విరూపాక్ష గ్లిమ్ప్స్ నుంచి చిత్ర యూనిట్ ప్రమోషన్స్ గేర్ మార్చింది. ఇకపై వెయిటింగ్ ఉండవు, అప్డేట్స్ మాత్రమే ఉంటాయి అంటూ సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు. మార్చ్ 1న విరూపాక్ష టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. గ్లిమ్ప్స్ కోసం ఎన్టీఆర్ ని దించిన విరూపాక్ష చిత్ర యూనిట్ టీజర్ కోసం రామ్ చరణ్ ని కానీ పవన్ కళ్యాణ్ ని కానీ వాడుతారేమో చూడాలి. మరి గ్లిమ్ప్స్ తో కొత్త ప్రపంచాన్ని చూపించిన చిత్ర యూనిట్, టీజర్ తో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూడాలి.

Read Also: SSMB 28: రేపటి నుంచే కొత్త షెడ్యూల్ షురూ… శ్రీలీలా జాయిన్ అవుతోంది

Show comments