NTV Telugu Site icon

Virupaksha: మొత్తానికి బౌండరీలు దాటుతున్నారు… ఈవారం కూడా విరుపాక్షదే

Virupaksha

Virupaksha

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ‘విరుపాక్ష’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టేసాడు. కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈ మూవీ అమలాపురం నుంచి అమెరికా వరకూ అన్ని సెంటర్స్ లో కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది. బ్రేక్ ఈవెన్ మార్క్ ఫస్ట్ వీక్ లోనే క్రాస్ చేసిన విరుపాక్ష మూవీ ఇప్పటివరకూ ఏడు రోజుల్లో 62.5 కోట్లని కలెక్ట్ చేసింది. ఏప్రిల్ 28న ఏజెంట్, పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాలు రిలీజ్ కి ఉన్నాయి కాబట్టి వీటి వలన విరుపాక్ష సినిమా కలెక్షన్స్ లో డ్రాప్ కనిపిస్తుందేమో అని ట్రేడ్ వర్గాలు లెక్కేసాయి కానీ ఏజెంట్ సినిమా నెగటివ్ టాక్ తెచ్చుకోవడంతో విరుపాక్ష సినిమాకి ఈ వీక్ కూడా కలిసోచ్చేలా ఉంది. ప్రస్తుతం ఉన్న బుకింగ్స్ ని ఇలానే మైంటైన్ చేస్తే చాలు విరుపాక్ష సినిమా తెలుగు వెర్షన్ తోనే వంద కోట్లు రాబట్టడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు.

Read Also: Nora Fatehi: నోరా నువ్వు డ్రస్‌ వేసుకున్నావా? అలా చూపిస్తే ఎలా?

స్పైన్ చిల్లింగ్ బ్లాక్ బస్టర్ గా పేరు తెచ్చుకున్న విరుపాక్ష మూవీ అనౌన్స్మెంట్ సమయంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ప్రొజెక్ట్ అయ్యింది. రిలీజ్ సమయంలో తెలుగుకి మాత్రమే స్టిక్ అయ్యారు కానీ ఇక్కడ సూపర్ హిట్ టాక్ వచ్చేయడంతో మేకర్స్ ఇప్పుడు బౌండరీలు దాటడానికి రెడీ అయ్యారు. హిందీలో గోల్డ్ మైన్స్, తమిళ్ లో స్టూడియో గ్రీన్, మలయాళంలో E4E మూవీస్ విరుపాక్ష సినిమాని రిలీజ్ చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన పోస్టర్స్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. మే 5న విరుపాక్ష సినిమా హిందీ, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ అవ్వనుంది. మరి కాంతార స్టైల్ లో ఇక్కడ హిట్ అయిన విరుపాక్ష మూవీ ఇతర ఇండస్ట్రీల బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో చూడాలి.