Site icon NTV Telugu

16న ‘మంచి రోజులు వ‌చ్చాయి’ ఫ‌స్ట్ సింగిల్ సాంగ్!

Sai Dharam Tej to launch So So Ga song tomorrow at 11am

యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా మారుతీ దర్వకత్వంలో నిర్మిస్తున్న సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌కు కూడా చక్కని స్పందన వచ్చింది. ‘ఏక్ మినీ కథ’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న యువ కథానాయకుడు సంతోష్ శోభన్ ఈ చిత్రంలో మెయిన్ లీడ్ చేస్తున్నాడు. ‘మహానుభావుడు’ లాంటి హిట్ సినిమా తర్వాత మారుతి కాంబినేషన్‌లో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను వి సెల్యులాయిడ్ బ్యానర్ లో ఎస్కేఎన్ నిర్మిస్తున్నారు.

Read Also : షూటింగ్ లోనే పంద్రాగస్ట్ వేడుకలు!

‘టాక్సీవాలా’ తర్వాత ఈయన నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది. తాజాగా ఈ మూవీ నుంచి ‘సో సో గా ఉన్న’ ప్రోమో సాంగ్ విడుదలైంది. సెన్సేషనల్ సింగర్ సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించారు. ఈ పాటను ప్రముఖ లిరిక్ రైటర్ కేకే రాసారు. ఆగస్ట్ 16న ఫుల్ సాంగ్ ను సుప్రీమ్ హీరో సాయితేజ్ విడుద‌ల చేయ‌నున్నారు. ఈ మూవీకి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version