NTV Telugu Site icon

Sai Dharam Tej: ఈ అమ్మాయిని కాస్త చూసుకో ‘మార్క్’ బ్రో…

Sai Dharam Tek

Sai Dharam Tek

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కొడుకు ఆకాష్ పూరిని హీరోగా పెట్టి ప్రొడ్యూస్ చేసిన సినిమా ‘రొమాంటిక్’. ఈ మూవీతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఢిల్లీ బ్యూటీ ‘కేతిక శర్మ’. మొదటి సినిమాలోనే పూరి చేతిలో పడితే యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే సీన్స్ పడతాయి, అక్కడి నుంచి ఏ హీరోయిన్ కైనా గోల్డెన్ ఫేజ్ స్టార్ట్ అయిపోతుంది. అలానే రొమాంటిక్ సినిమాలో కూడా కేతిక శర్మ పది సినిమాల్లో చూపించాల్సిందంతా ఒక సినిమాలోనే చూపించేసింది. బీచ్ సాంగ్, రొమాంటిక్ సీన్స్ అనే తేడా లేకుండా అన్ని సీన్స్ లో గ్లామర్ షో చేసేసింది. ఈ సినిమాని చూసిన ఆడియన్స్ కి విజువల్ ట్రీట్ ఇచ్చేసింది కేతిక శర్మ. బీచ్ అందాలని చూడాలా లేక కేతిక అందాలని చూడాలా అనే డైలమాలో యూత్ పిచ్చెక్కి పోయారు. రొమాంటిక్ సినిమా హిట్ అయ్యి ఉంటే కేతిక శర్మ కెరీర్ ఇప్పుడు టాప్ గేర్ లో ఉండేది. ఈ సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో కేతిక ఎంత చూపించినా, అది ఆమె కెరీర్ కి ఉపయోగ పడకుండా పోయింది.

ఆ తర్వాత నాగ శౌర్యతో కలిసి ‘లక్ష్య’ సినిమాలో కేతిక నటించింది కానీ ఆ సినిమాలో ఎక్కువ సేపు స్క్రీన్ స్పేస్ కూడా దొరకలేదు. ఇక ఉప్పెన సినిమాతో సాలిడ్ డెబ్యూ ఇచ్చిన పంజా వైష్ణవ్ తేజ్ అయినా తన కెరీర్ ని టర్న్ చేస్తాడు అనే ఆశతో కేతిక ‘రంగ రంగ వైభవంగా’ సినిమా చేసింది. ఈ సినిమాలో చుడిదార్లు వేసుకోని కూడా హాట్ గా కనిపించగలనని ప్రూవ్ చేసింది కేతిక. తన రెండు సినిమాల కన్నా యాక్టింగ్ కాస్త ఎక్కువే చేసినా, స్కిన్ షో కాస్త తగ్గించి తనలోని యాక్టర్ ని ప్రూవ్ చేసుకున్నా… సినిమా ఫ్లాప్ అవ్వడంతో కేతిక కెరీర్ మళ్లీ మొదటికి వచ్చింది. రంగ రంగ వైభవంగా రిలీజ్ అయ్యి ఏడాది కావొస్తున్నా కేతికకి అవకాశాలు రావట్లేదు. చేసిన మూడు సినిమాలు పోవడంతో కేతిక కెరీర్ కంప్లీట్ గా రిస్క్ ఫేజ్ లోకి వెళ్లిపోయింది.

ఇక కొత్త హీరోయిన్స్ వచ్చేసారు, కేతిక కనిపించడం కష్టమే అనుకుంటున్న సమయంలో సాయి ధరమ్ తేజ్-పవన్ కళ్యాణ్ నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘బ్రో’లో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో తేజ్ కి జోడిగా కేతిక నటించనుంది. మెగా ఫ్యామిలీలో ఇప్పటికే ఒక సినిమా చేసేసిన కేతిక శర్మ, సాయి ధరమ్ తేజ్ పక్కన ఎలా కనిపిస్తుంది, ఆమెని ఆడియన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు, బ్రో సినిమా ఎలాంటి రిజల్ట్ ని సొంతం చేసుకుంటుంది అనే దానిపైనే కేతిక శర్మ కెరీర్ ఆధారపడి ఉంది. మరి తనకి జోడిగా నటించే హీరోయిన్ కి సాయి ధరమ్ తేజ్ ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి.

Show comments