Sai Dharam Tej: మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరోల్లో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఒకడు. కెరీర్ మొదట్లో కొన్ని పరాజయాలను చవిచూసినా.. తన వ్యక్తిత్వంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక తేజ్ కు యాక్సిడెంట్ అవ్వడంతో ఆడో పెద్ద సెన్సేషన్ సృష్టించి మరింత ఫేమస్ అయ్యాడు. చావు చివరి అంచుల వరకు వెళ్లి తిరిగివచ్చిన తేజ్.. జీవితం విలువ తెలుసుకొని.. కంగారుపడకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇక గతేడాది ఆగస్టు 15 కు సత్య అనే ఫీచర్ ఫిల్మ్ ను తేజ్ రిలీజ్ చేశాడు. నరేష్ కుమారుడు, తేజ్ ఫ్రెండ్ అయిన నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వం వహించి, నిర్మించిన ఈ ఫీచర్ ఫిల్మ్ మంచి అవార్డులను కూడా అందుకుంది. ఇందులో తేజ్ సరసన కలర్స్ స్వాతి నటించింది.
ఇక తాజాగా ఈ ఇద్దరు స్నేహితులు కలిసి ఒక ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించారు. నరేష్ కుటుంబానికి పెద్ద దిక్కు అయిన విజయ నిర్మలలోని విజయను .. తేజ్ తల్లిపేరులోని దుర్గను తీసుకొని విజయదుర్గ ప్రొడక్షన్ హౌస్ ను మొదలుపెట్టారు. ఈ విషయాన్నీ తేజ్.. అధికారికంగా అభిమానులతో పంచుకున్నాడు. తమ ప్రొడక్షన్ హౌస్ కు తన ముగ్గురు మామయ్యల ఆశీర్వాదం కూడా దక్కిందని తేజ్ తెలిపాడు. ” కొత్త ప్రారంభం.. నా తల్లికి ఆమె పేరు మీద ఒక చిన్న బహుమతిని ప్రకటించినందుకు సంతోషంగా ఉంది, మా ప్రొడక్షన్ హౌస్ విజయదుర్గాప్రోడ్ ను మా మామయ్యలు ఆశీస్సులతో ప్రారంభించాను.నా కెరీర్‌లో మొదట్లో నాకు సహకరించిన నిర్మాత దిల్‌రాజు ఈ ప్రొడక్షన్ హౌస్ ను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. నా బెస్ట్ ఫ్రెండ్స్‌తో చేసిన “సత్య” లాంటి అమూల్యమైన అసోసియేషన్‌తో దీన్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఇలాంటివి ఎన్నో ముందు ముందు రానున్నాయి” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
A New beginning ☺️
Happy to announce a small gift to my mother on her name,
Our Production House @VijayaDurgaProd 🥳Begun this on an auspicious note with the blessings of My Mavayyas@KChiruTweets mama@NagaBabuOffl mama
& my guru garu @PawanKalyan mamaMy Producer #DilRaju… pic.twitter.com/XZBS1V0zBT
— Sai Dharam Tej (@IamSaiDharamTej) March 9, 2024
