Site icon NTV Telugu

Sai Dharam Tej: రామ్ చరణ్ లాంచ్ చేసిన ‘సోల్ ఆఫ్ సత్య’

Sai Dharam Tej

Sai Dharam Tej

సుప్రీమ్ హీరో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, తన ఫ్రెండ్ నవీన్ విజయ్ కృష్ణ కోసం చేస్తున్న స్పెషల్ సాంగ్ ‘సత్య’. యాంకర్ టర్న్డ్ హీరోయిన్ కలర్స్ స్వాతి టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ సాంగ్ లో సూర్యగా సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నాడు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి త్యాగానికి గుర్తుగా ఈ సత్య సాంగ్ ని చేసారు. గతంలో ఈ స్పెషల్ సాంగ్ టీజర్ ని రిలీజ్ చేసిన టీం, లేటెస్ట్ గా ఇండిపెండెన్స్ రోజున ఫుల్ సాంగ్ ని బయటకి వదిలారు. దాదాపు ఆరున్నర నిముషాలు ఉన్న ఈ సాంగ్ ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ లాంచ్ చేసాడు. ఈ సాంగ్ కు శృతి రంజని సంగీతం అందించడమే కాకుండా సాంగ్ కూడా పాడడం విశేషం.

దేశం కోసం ప్రణాలిచ్చే సైనికుడిగా సాయి ధరమ్ తేజ్ నటించగా, అతని వైఫ్ సత్యగా స్వాతి నటించింది. ఈ ఇద్దరి మధ్య ఎమోషన్ ని పర్ఫెక్ట్ గా పోట్రె చేసారు. ఒక సైనికుడి భార్య అంతర్మథనాన్ని సోల్ ఆఫ్ సత్య సాంగ్ లో నవీన్ బాగా చూపించాడు. సాధారణ భార్యగా స్వాతిలోని ఎమోషన్స్ ఈ సాంగ్ కి మెయిన్ హైలైట్ అనే చెప్పాలి. ఆమె పడే ఆవేదన, ఆమె సంతోషం, ఆమె ఆనందం చుట్టూనే ఈ సాంగ్ ని డిజన్ చేసారు. సాయి ధరమ్ తేజ్ కూడా సాంగ్ లో చాలా బాగున్నాడు. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడం వలనే సాంగ్ ఎండ్ లో ఎమోషన్ కనెక్ట్ అయ్యింది. పర్ఫెక్ట్ గా సీన్స్ ని రెడీ చేసి సినిమాగా మలిస్తే సోల్ ఆఫ్ సత్య మంచి ఎమోషనల్ సినిమా అవుతుంది.

Exit mobile version