NTV Telugu Site icon

Dakshina Motion Poster: ఓషో తులసీరామ్ ‘దక్షిణ’ మోషన్ పోస్టర్ రిలీజ్

Dakshina Motion Poster

Dakshina Motion Poster

Dakshina: సాయి ధన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతోన్న లేడీ ఓరియెంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘దక్షిణ’. ఛార్మీతో ‘మంత్ర’, ‘మంగళ’ తీసిన ఓషో తులసీరామ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రాన్ని కల్ట్ కాన్సెప్ట్స్ పతాకంపై అశోక్ షిండే నిర్మిస్తున్నారు. నవంబర్ 20న సాయి ధన్సిక పుట్టినరోజు పురస్కరించుకుని ‘దక్షిణ’ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అశోక్ షిండే మాట్లాడుతూ ‘సాయి ధన్సిక పేరు వినగానే ‘కబాలి’ గుర్తుకు వస్తుంది. మా సినిమా తర్వాత ఆమెను ‘దక్షిణ’ ఫేమ్ ధన్సిక అంటారు. ఆవిడ రోల్ అంత పవర్ ఫుల్ గా ఉంటుంది.

ఇందులో కథ ఎంత హైలైట్ అవుతుందో సాయి ధన్సిక పెర్ఫార్మెన్స్ అంత హైలైట్ అవుతుంది. బెంగాలీ హీరో రిషవ్ బసు విలన్ రోల్ చేస్తున్నారు. ఇదొక సైకో థ్రిల్లర్. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నాం. 70 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. గోవా, హైదరాబాద్ లో షూటింగ్ చేశాం. డిసెంబర్ లో విశాఖలో జరిపే షెడ్యూల్ తో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ‘మంత్ర’, ‘మంగళ’ ట్రెండ్ సెట్ చేశాయి. వాటి తరహాలో ‘దక్షిణ’ కూడా ఉంటుంది” అని అంటున్నారు.