NTV Telugu Site icon

Sahithi Dasari: నేనే పొలిటికల్ పార్టీని ప్రమోట్ చేయడం లేదు.. కొట్టుకుంటా అంటే కొట్టుకోండి!

Sahithi Dasari Comments

Sahithi Dasari Comments

Sahithi Dasari clarity on Political Promotions: పొలిమేర, పొలిమేర 2 సినిమాలలో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది సాహితీ దాసరి. పొలిమేర సినిమాలో గెటప్ శ్రీను భార్య రాములు పాత్రలో నటించిన ఆమె రెండో భాగంలో సత్యం రాజేష్ ను ప్రేమించిన అమ్మాయిగా తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం చిన్న చిన్న సినిమాలు చేస్తూ పెద్ద సినిమాలలో చిన్న పాత్రలు చేస్తున్న ఆమె అనూహ్యంగా ఒక పొలిటికల్ వివాదంలో చిక్కుకుంది. అసలు విషయం ఏమిటంటే తాజాగా ఆమె తన సోషల్ మీడియా వేదికగా గుంటూరు కారం సినిమాలోని ఒక పాటకు డాన్స్ చేసి అప్లోడ్ చేసింది. అయితే ఆమె డాన్స్ చేసిన టెర్రస్ మీద వెనుక వైఎస్ జగన్ సిద్ధం పోస్టర్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె వైఎస్ జగన్ ని ప్రమోట్ చేస్తోంది అంటూ టీడీపీ, జనసేనకు చెందిన కొందరు ఆమె వీడియోల మీద కామెంట్స్ చేస్తూ వచ్చారు.

Tripti Dimri : ఆ బాలీవుడ్ హారర్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన తృప్తి..

తనకు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఏది లేదని ముందు నుంచి ఆ వీడియోలో కామెంట్లకు స్పందిస్తూ వస్తున్న ఆమె ఇది ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదని భావించి సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘమైన క్లారిటీ ఇచ్చింది. తాను పవన్ కల్యాణ్ అభిమానిని అని పేర్కొన్న ఆమె ఆయన నటన అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది. అలాగే వైఎస్ జగన్ గారి గురించి తనకు ఐడియా లేదని చెప్పుకొచ్చింది. తాను చేసిన పాటలకు సంబంధించి ఎలాంటి పొలిటికల్ విషయాలు అపాదించవద్దు అని పేర్కొన్న ఆమె ఇంత చెప్పినా సరే కామెంట్స్ చేస్తామంటే చేయండి మీరు కొట్టుకు చావండి అంటూ రాసుకొచ్చింది.