NTV Telugu Site icon

Sagileti Katha Trailer: తెలంగాణాకి బలగం.. రాయలసీమకి ’సగిలేటి కథ’

Sagiletikatha Trailer

Sagiletikatha Trailer

Sagileti Katha Trailer Launched by Navdeep: యూట్యూబ్ ఫేమస్ రవి మహా దాస్యం, విషిక లక్ష్మణ్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘సగిలేటి కథ’ సినిమా రిలీజ్ కు సిద్ధం అవుతోంది. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ సినిమాకి ‘రాజశేఖర్ సుద్మూన్’ రచన, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ సహా దర్శకత్వం కూడా వహించారు. ఈ సినిమాను అశోక్ ఆర్ట్స్, షేడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లపై దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను హీరో నవదీప్ సి- స్పేస్ సమర్పిస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ ను లాంచ్ చేశారు. హీరో నవదీప్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి హీరో సోహెల్, ప్రొడ్యూజర్ జి సుమంత్ నాయుడు విచ్చేయగా డైరెక్టర్ ‘రామ్ గోపాల్ వర్మ’ ఈ సినిమా యూనిట్ కి వీడియో క్లిప్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.

SS Thaman: నా ధైర్యం, నా బలం త్రివిక్రమ్.. కానీ దేవునిపై మనసు విరిగింది !

రాయలసీమలో పెన్నానదికి ఉపనది అయిన సగిలేరు తీరంలో ఒక జాతర నేపథ్యంలో రుచికరమైన చికెన్ తినడానికి తహతహలాడే ఒక పాత్ర చుట్టూ తిరిగే కథ అని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతోంది. ఇక సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. ఈ సినిమాలో రుచికరమైన కోడిమాంసం తినాలనేది ఒక కీలక పాత్ర లక్ష్యం, అందుకే కోడి కేంద్రంగా సినిమా ఉంటుంది కానీ, కథ అంతకు మించినదని మేకర్స్ చెబుతున్నారు. సెట్‌లో అందరూ ఈగోలు లేకుండా పనిచేశారని, సినిమాలో కొన్ని సర్ప్రైజ్‌లు ఉన్నాయని అంటున్నారు. అంతేకాదు సినిమాలో ఉన్న ఒక చికెన్ సాంగ్ చూశాక వెజ్ తినేవారు సైతం నాన్ వెజ్ వెంట పడితే తనకి సంబంధం లేదని అంటున్నారు ఈ సినిమా డైరెక్టర్. అలాగే తెలంగాణ నుంచి ఎలా అయితే బలగం వచ్చిందో మా రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా వస్తుందని అంటున్నారు. మరి ఆ ట్రైలర్ మీరూ చూసేయండి మరి.