Site icon NTV Telugu

Maanas: గుండెల్ని పిండేలా మానస్ డాన్స్.. ఏడ్చేసిన సదా!

Maanas Sada

Maanas Sada

Sada broke into tears after watching Maanas – Subhasree Performance: పలు సినిమాలలో హీరోగా చేసిన మానస్ కి అక్కడ సరైన బ్రేక్ దొరకలేదు. దీంతో సీరియల్స్ లో హీరోగా నటించడం మొదలుపెట్టి ఇప్పటికే అనేక సీరియల్స్ లో హీరోగా నటించాడు, ప్రస్తుతానికి టాప్ టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్న బ్రహ్మముడి సీరియల్ లో కూడా రాజ్ అనే పాత్రలో నటిస్తున్నాడు. అయితే బిగ్ బాస్ లో మానస్ చేసిన హంగామా అంతా కాదు, సీజన్ 5లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్న మానస్ మంచి పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు హౌస్ లో ఆ సీజన్ విజేత వీజే సన్నీతో ఉన్న బాండింగ్ గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉండేది. అయితే ప్రస్తుతానికి మానస్ ఒకపక్క సినిమాలు, సీరియల్స్ చేసుకుంటూనే స్టార్ మాలో ప్రసారమవుతున్న ఒక డాన్స్ షోలో కూడా పాల్గొంటున్నాడు.

KU Mohanan: నా కూతుర్ని హీరోయిన్‌గా ఎప్పటికీ రికమెండ్ చేయను..ఎందుకంటే?

నీతోనే డాన్స్ 2.0 అనే కార్యక్రమంలో పాల్గొంటున్న మానస్ తాజాగా బిగ్ బాస్ ఫేం శుభశ్రీ రాయగురుతో కలిసి ఒక డాన్స్ పర్ఫామెన్స్ చేశాడు. 7/g బృందావన్ కాలనీలో ఉన్న ఒక కన్నీళ్లు తెప్పించే పాటకి వీరిద్దరూ కలిసి చేసిన డాన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. మరీ ముఖ్యంగా గుండెల్ని పిండేసే విధంగా ఆ పాటకి వీరు ఇద్దరూ చేసిన కాన్సెప్ట్ బాగా సెట్ అయింది. దీంతో ఈ కార్యక్రమానికి జడ్జిలుగా హాజరైన వారందరూ పర్ఫామెన్స్ కి ఫిదా అయిపోయారు. మరీ ముఖ్యంగా సదా అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ వారి పెర్ఫార్మన్స్ మీద ప్రశంసల వర్షం కురిపించింది. ఇక ప్రస్తుతానికి అయితే ప్రోమో రిలీజ్ అయింది. త్వరలోనే ఫుల్ ఎపిసోడ్ కూడా టెలికాస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Exit mobile version