NTV Telugu Site icon

Jabardasth Avinash: బిడ్డని కోల్పోయిన అవినాష్… తల్లి గర్భంలోనే మరణించిన శిశువు

Jabardasth Avinash

Jabardasth Avinash

జబర్దస్త్ కామెడీ షోతో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు అవినాష్. ముక్కు అవినాష్ గా బాగా పేరు తెచ్చుకోని కాస్త డబ్బులు కూడా తెచ్చుకున్న అవినాష్, జబర్దస్త్ నుంచి బిగ్ బాస్ హౌజ్ కి వెళ్లి అక్కడ కూడా ఆడియన్స్ ని బాగానే ఎంటర్టైన్ చేసాడు. జబర్దస్త్ నుంచి బయటకి వచ్చిన తర్వాత అవినాష్ స్టార్ మా ఛానెల్ కి షిఫ్ట్ అయిపోయాడు. 2021లో అనుజాని పెళ్లి చేసుకున్న అవినాష్… ఆడియన్స్ కి కూడా పరిచయం చేసాడు. ఈ జంట మెటర్నిటీ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో సందడి చేసాయి. మరో మూడు నెలల్లో అనుజా-అవినాష్ లైఫ్ లోకి కొత్త వ్యక్తి ఎంటర్ అవుతాడు అనుకుంటే ఊహించని విధంగా అనుజాకి మిస్ క్యారేజ్ అయ్యింది. 7వ నెలలో తల్లి గర్భంలోనే బిడ్డ చనిపోయింది అంటూ అవినాష్ తన అభిమానులతో ఈ విషయాన్ని పంచుకున్నాడు.

“నా లైఫ్ లో సంతోషమైన, బాధ అయినా… నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటాను. ఇప్పటి వరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను. కానీ మొదటి సారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందాం అని అనుకుంటున్నాను. మేము అమ్మ నాన్న అవ్వాలనే ఆ రోజు కోసం ఎదురు చూసాం. కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డనీ కొల్పోయాం. ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది. అంత తొందరగ మర్చిపోలేనిది. మీకు ఎప్పటికైనా చెప్పాలీ అన్న బాధ్యతతో ఈ విషయాన్నీ మీతో పంచుకుంటున్నాను. ఇప్పటివరకు మీరు మాపై చూపించిన ప్రేమకీ థంక్యూ. మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టవద్దు. మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ అనూజ అవినాష్..” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు అవినాష్. ఇలాంటి కష్ట సమయంలో అభిమానులు అవినాష్ కి అండగా నిలుస్తూ రిప్లైలు ఇస్తున్నారు.

Show comments