Site icon NTV Telugu

Shubhangi Tambale: సబితా ఇంద్రారెడ్డి రిలీజ్ చేసిన ‘ఫిమేల్’ పోస్టర్!

Sabita Indrareddy Launched Female Poster

Sabita Indrareddy Launched Female Poster

నాని తిక్కిశెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ వెలిచర్ల ప్రదీప్ రెడ్డి నిర్మించిన సినిమా ‘ఫిమేల్’. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ టైటిల్ రివేలింగ్ పోస్టర్ ను తెలంగాణ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు దోహదపడి, మగాళ్లలో మార్పు తీసుకువచ్చే విధంగా ఉండాలని కోరుకుంటున్నానని సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. దర్శకుడు నాని తిక్కిశెట్టి, నిర్మాత వెలిచర్ల ప్రదీప్ రెడ్డితో పాటు చిత్రబృందానికి ఆమె శుభాకాంక్షలు తెలిపారు.

శుభాంగి తంభాలే టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో జబర్దస్త్ బేబీ దీవెన, దీపిక, తమన్నా సింహాద్రి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మహిళల పట్ల జరుగుతున్న దారుణాలపై విప్లవాత్మకమైన పరిష్కారాన్ని సూచిస్తూ రూపొందిన ఈ విభిన్న కథాచిత్రం త్వరలో విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంది. ఈ చిత్రానికి వంశీకాంత్ రేఖన సంగీతాన్ని అందిస్తుండగా, జగదీష్ కొమరి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version