Site icon NTV Telugu

RRR : రాజమౌళి యాక్షన్ సీక్రెట్ రివీల్… సీక్వెల్ పై కూడా క్లారిటీ

Rajamouli

Rajamouli

దర్శక దిగ్గజం రాజమౌళి మ్యాగ్నమ్ ఓపస్ మూవీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. మరోవైపు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో చిత్రబృందం సైతం సంతోషంగా ఉన్నారు. బుధవారం రాత్రి ముంబైలో సినిమా హిట్ అయిన సందర్భంగా “ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీ”ని నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ త్రయం ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. మీడియా సమావేశంలో స్టార్ హీరోలిద్దరూ “ఆర్ఆర్ఆర్” సీక్వెల్ ఉండాలని కోరుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ “రాజమౌళి RRR 2ని చేస్తాడని ఆశిస్తున్నాను” అనగా, రామ్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “ఆర్ఆర్ఆర్” సీక్వెల్ పై రాజమౌళి స్పందిస్తూ “ఆర్ఆర్ఆర్”తో పెంచిన హీట్ ను తగ్గించడానికి ట్రై చేస్తున్నాను. ముందు ఈ హీట్ తగ్గనివ్వండి. ఇక RRR 2 కోసం చెర్రీ, తారక్ లతో కలిసి మరింత సమయాన్ని గడపడం నాకు సంతోషంగా ఉంటుంది” అని అన్నారు. దీంతో రాజమౌళి RRR 2కు సన్నాహాలు చేసే అవకాశం ఉందని ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు.

Read Also : Hari Hara Veera Mallu : యాక్షన్ మోడ్ లో… కొత్త లుక్ వైరల్

ఇక RRR ఐకానిక్ ఇంటర్వెల్ బ్లాక్ వెనుక ఉన్న ఆలోచన ప్రక్రియ గురించి కూడా రాజమౌళి మాట్లాడారు. రాజమౌళి RRRలో అసలు యాక్షన్ సన్నివేశాలను ఎలా సృష్టించాడో ఆ సీక్రెట్ ని కూడా రివీల్ చేశాడు. రాజమౌళి మాట్లాడుతూ ”విజువల్ గ్రాండియర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇది వారి మనస్సును ఆకర్షిస్తుంది, కానీ వారిని వారి హృదయంలో ఉంచడానికి, నొప్పి మరియు అవమానాల యొక్క భావోద్వేగాలను అధిగమించడం, దానిని దాదాపు ఒకటిన్నర గంటల పాటు సాగదీయడం, ప్రేక్షకుల ఎమోషన్ కు తగ్గట్టుగా వాటిని చూపించడం చాలా ముఖ్యం. కాబట్టి విజన్ అనేది ప్రేక్షకులు ఆశించినట్టుగా ఉండాలి. అందుకే మేము ఈ సీక్వెన్స్‌తో ముందుకు వచ్చాము. ఇక నేను సినిమాలను పెద్ద వాళ్ళ కోసం రాయను. చిన్న పిల్లల కోసం రాస్తాను. ప్రతి మనిషిలో ఒక పిల్లాడు ఉంటాడు. అలా సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది, దగ్గరవుతుంది” అని రాజమౌళి వెల్లడించారు.

Exit mobile version