NTV Telugu Site icon

Ajay Bhupathi: ‘మంగళవారం’ ఏం జరిగింది?

Ajay Bhupathi

Ajay Bhupathi

ఆర్ ఎక్స్ 100 సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు డెబ్యు డైరెక్టర్ అజయ్ భూపతి. ప్రమోషన్స్ లో ఈ సినిమాని అడల్ట్ కంటెంట్ లా ప్రాజెక్ట్ చేసిన అజయ్ భూపతి, థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ ని ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. ప్రేమకథలో ఇలాంటి విలన్స్ కూడా ఉంటారా అనే అనుమానం వచ్చే రేంజులో చూపించిన అజయ్ భూపతి, ఆర్ ఎక్స్ 100 హిట్ అవ్వడంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ కి మరో రామ్ గోపాల్ వర్మ అవుతాడని అందరూ అనుకుంటున్న సమయంలో అజయ్ భూపతి ‘మహా సముద్రం’ సినిమా చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇదేంటి ఇలాంటి సినిమా చేశాడు? శర్వానంద్, సిద్దార్థ్ లాంటి హీరోలని పెట్టుకోని మహా సముద్రం సినిమాని ఫ్లాప్ ఇవ్వడంతో అజయ్ భూపతి క్రెడిబిలిటీ పూర్తిగా దెబ్బతినింది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఎక్కువ మాట్లాడాడు, మాటలు తగ్గించి సినిమా బాగా తెరకెక్కిస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరూ సలహా ఇచ్చారు. నెగటివ్ కామెంట్స్ ఎక్కువ అవ్వడంతో అజయ్ భూపతి కాస్త గ్యాప్ తీసుకోని ‘మంగళవారం’ అనే సినిమా చేస్తున్నాడు.

తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఎవరు నటిస్తున్నారు అనే విషయంలో క్లారిటీ రాలేదు కానీ కాన్సెప్ట్ పోస్టర్ మాత్రం బయటకి వచ్చింది. బటర్ఫ్లై ని తలపించేలా డిజైన్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ లో ఒక అమ్మాయి నిలబడి ఉంది, ఆ అమ్మాయిని చాలా కళ్ళు చూస్తున్నాయి. ఈ కాన్సెప్ట్ పోస్టర్ చూస్తుంటే అజయ్ భూపతి లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నట్లు ఉన్నాడనిపిస్తోంది. కాంతార సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేసిన అజ్నీష్ లోకనాథ్, మంగళవారం సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి ఈ మూవీలో ఎవరు నటిస్తున్నారు? ఎలాంటి కథతో అజయ్ భూపతి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు? అనే విషయాలని సమాధానం తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.