NTV Telugu Site icon

Rush Movie: ఓటీటీలో దూసుకుపోతున్న ర‌విబాబు ర‌ష్‌

Ravibabu Rush

Ravibabu Rush

Rush Movie getting Huge Response in ETV Win: విభిన్న కథలు సినిమాలుగా తెరకెక్కిస్తూ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రవిబాబు. సీనియర్ నటుడు చలపతిరావు తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన రవిబాబు దర్శకుడిగా మారాలని అనుకున్నా ముందుగా నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో తండ్రిలానే విలన్ పాత్రలతో మెప్పించి తర్వాత అమెరికా వెళ్లి దర్శకత్వంలో శిక్షణ తీసుకున్నాడు. అల్లరి నరేష్ ను హీరోగా పరిచయం చేస్తూ అల్లరి అనే సినిమా చేసిన రవిబాబు తొలి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. ఆతర్వాత వరుసగా అమ్మాయిలు అబ్బాయిలు, సోగ్గాడు, పార్టీ అనే సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించాడు.

తాజాగా రవిబాబు నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తూ, కథ – స్క్రీన్ ప్లే అందించిన‌ చిత్రం ‘రష్’. సతీశ్ పోలోజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డైసీ బొపన్న ప్రధాన పాత్ర పోషించింది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో, యూనిక్ పాయింట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా ‘ఈటీవీ విన్`ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక సాధార‌ణ గృహిణికి కొన్ని అసాధార‌ణ ప‌రిస్థితులు ఎదురైతే వాటిని ఆమె ధైర్యంగా ఎలా ఎదుర్కొంది అనే ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో అద్భుత‌మైన యాక్ష‌న్ ఎపిసోడ్స్‌తో ఈ సినిమా తెర‌కెక్కింది. ఈ సినిమా ప్రస్తుతం ఈటీవి విన్‌లో మంచి ప్రేక్ష‌కాధ‌ర‌ణ‌తో దూసుకుపోతుంది. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ర‌ష్ త‌ప్ప‌క ఒక మంచి ఛాయిస్‌ అంటున్నారు మేకర్స్.