Site icon NTV Telugu

Toxic : యశ్ ‘టాక్సిక్’‌లో.. మరో హీరోయిన్ సర్ప్రైజ్ ఎంట్రీ

Yash Taxic

Yash Taxic

కన్నడలో కొత్త తరం స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న రుక్మిణి వసంత్‌ వరుసగా భారీ ప్రాజెక్ట్స్‌లో భాగమవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల రిషబ్‌ శెట్టితో కాంతార: చాప్టర్ 1, శివ కార్తికేయన్‌తో మదరాసి సినిమాల్లో నటించిన ఆమె, ఇవి రెండూ రిలీజ్‌కు సిద్ధంగా ఉండటంతో ఫ్యాన్స్‌లో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఇకపోతే, ఎన్టీఆర్‌ – ప్రశాంత్ నీల్‌ కాంబినేషన్‌లో వస్తున్న మాస్ యాక్షన్ డ్రామా లో కూడా ఆమె పేరు వినిపిస్తోంది. ఈ క్రమంలోనే రుక్మిణి ఖాతాలోకి ఇప్పుడు మరొక పాన్‌ ఇండియా ప్రాజెక్ట్ చేరింది.

Also Read : Mithun Chakraborty : 45 కోట్ల విలాస భవంతిని కుక్కల కోసం డొనేట్ చేసిన స్టార్ హీరో !

అదే యశ్‌ హీరోగా నటిస్తున్న ‘టాక్సిక్’. కేజీఎఫ్ సిరీస్ ఘన విజయం తర్వాత యశ్ చేస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కియారా అడ్వాణీ ప్రధాన కథానాయికగా నటిస్తుండగా, నయనతార, తారా సుతారియా, హ్యుమా ఖురేషీ లాంటి స్టార్ నటీమణులు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పుడు వీరి జాబితాలో రుక్మిణి వసంత్ కూడా చేరినట్లుగా టాక్ వినిపిస్తోంది. అధికారికంగా ప్రకటన రానప్పటికి ఆమె ఈ సినిమాలో ఓ కీలకమైన రోల్‌లో నటించబోతుందని సమాచారం. కన్నడ నటుడు బాలాజీ మనోహర్ కూడా ఈ చిత్రంలో నటించనున్నారు. పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న టాక్సిక్ వచ్చే ఏడాది మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. మొత్తానికి రుక్మిణి వరుస చిత్రాలతో దూసుకుపోతుంది.

Exit mobile version