Site icon NTV Telugu

Raghava Lawrence: క్రిస్మస్ కు రాబోతున్న ‘రుద్రుడు’!

Raghava Lawrence

Raghava Lawrence

 

కొరియోగ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ ప్రస్తుతం కతిరేసన్ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కతిరేశన్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి ‘రుద్రు’డు అనే టైటిల్‌ను పెట్టారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ గురువారం విడుదలైంది. పోస్టర్‌లో రాఘవ లారెన్స్ స్టంట్ సీక్వెన్స్‌లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. పోస్టర్‌ని చూస్తే మూవీలో యాక్షన్‌ హైలైట్‌గా వుండబోతుందనిపిస్తోంది.

‘ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్, ఇట్ ఈజ్ క్రియేటడ్’ అనేది సినిమా ట్యాగ్‌లైన్. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో లారెన్స్ ఈవిల్ లుక్ లో కనిపించడం ఆసక్తిని పెంచింది. శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్న ‘రుద్రుడు’లో లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తోంది. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రానికి ఆర్ డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇప్పటికే తొంభై శాతం షూటింగ్ పూర్తయింది. ‘రుద్రుడు’ను 2022 క్రిస్మస్‌కు థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

Exit mobile version