Rudramkota Director Ramu Kona Interview: సీనియర్ నటి జయలలిత సమర్పకులుగా వ్యవహిరిస్తూ కీలక పాత్రలో నటిస్తున్న `రుద్రంకోట`సెప్టెంబర్ 22న స్క్రీన్ మాక్స్ సంస్థ ద్వారా గ్రాండ్ గా విడుదలకు సిద్ధమవుతోంది. ఏఆర్ కె విజువల్స్ పతాకంపై రాము కోన దర్శకత్వంలో అనిల్ ఆర్కా కండవల్లి ఈ సినిమాను నిర్మించగా రుద్ర, శక్తి, విభీష హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ కి దగ్గర పడిన సందర్భంగా ఐదు వేలకు పైగా సీరియల్ ఎపిసోడ్స్ కు డైరక్షన్ చేసి…`రుద్రంకోట`సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతోన్న రాముకోన మీడియాతో మాట్లాడారు. తాను 2001లో నటుడు కావాలని ఇండస్ట్రీకి వచ్చి చాలా ప్రయత్నాలు చేశాను కానీ వర్కవుట్ అవ్వలేదని, ఆ తరుణంలో ఒక మేకప్ మ్యాన్ ద్వారా `పద్మవ్యూహం` కొన్ని రోజులు సీరియల్ కు పని చేశానని అన్నారు. మద్రాసు వెళ్లి డైరక్టర్ సురేష్ గారి వద్ద ఒక సీరియల్ కు అసిస్టెంట్ డైరక్టర్ చేరి చాలా వర్క్ నేర్చుకున్నానని అన్నారు. ఆ తర్వాత ప్రామ్టర్ గా కొన్ని సీరియల్స్ కు పని చేసి అన్ని మేజర్ టీవీ ఛానల్స్ లో హిట్ సీరియల్స్ డైరక్ట్ చేశానని అన్నారు. ఇప్పటి వరకు దాదాపు ఐదు వేలకు పైగా ఎపిసోడ్స్ డైరక్ట్ చేశా, జీ తెలుగుకి, మాటీవీకి సీరియల్ ప్రొడక్షన్ కూడా చేశా అయితే `రుద్రంకోట` సినిమా డైరక్ట్ చేసే అవకాశం వచ్చిందని అన్నారు.
Vijay Antony: విజయ్ ఆంటోనీ కుమార్తెకు.. ఆ భయం.. కీలక విషయం బయటపెట్టిన సీనియర్ నటి!
రుద్రంకోట దగ్గర జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా చేశామని పేర్కొన్న ఆయన శ్మశాన వాటికలో పెరిగి పెద్దైన ఓ యుకుడి ప్రేమకథ అని, భద్రాచలం దగ్గర రుద్రంకోట అనే ఊరి నేపథ్యంలో కథ నడుస్తుందని అన్నారు. ఇప్పటి వరకు ఎవరూ చూపించని అంశాలను మా సినిమాలో చూపిస్తున్నామని ఇందులో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలుంటాయని అన్నారు. లవ్ అండ్ లస్ట్ తో సాగే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ అని అండర్ కరెంట్ గా మంచి సందేశం కూడా అందిస్తున్నాం, అదేంటో సినిమాలో చూస్తే అర్థమవుతుందని అన్నారు. ఇందులో లీడ్ రోల్ లో సీనియర్ నటి జయలలిత నటించారని, కోటమ్మ పాత్రలో ఆమె నటించిన తీరు అద్భుతం అని అన్నారు. హీరోగా రుద్ర, హీరోయన్స్ శక్తి, విభీష ఇద్దరూ పోటీ పడి నటించారని ప్రతి పాత్ర సినిమాకు కీలకంగా ఉంటుందని అన్నారు. దర్శకుడుగా నాకు ఆదర్శం రాజమౌళి గారని పేర్కొన్న రాము ఆయన కూడా మొదట `శాంతి నివాసం` అనే సీరియల్ చేసి ఆ తర్వాత సినిమాలు డైరక్ట్ చేసి…తెలుగు సినిమాను ఆస్కార్ స్థాయికి తీసుకెల్లారని అన్నారు. ఆయన ఆదర్శంతోనే సీరియల్ నుంచి నేను కూడా సినిమాల వైపు వచ్చానని రాము చెప్పుకొచ్చారు.