Site icon NTV Telugu

హాలీవుడ్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’కి సెకండ్ ప్లేస్

Rrr Korea Film Awards

Rrr Korea Film Awards

ఎన్టీఆర్, చరణ్ తో రాజమౌళి రాజమౌళి తీసిన మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం ఓటీటీలో దుమ్మురేపుతోంది. ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ప్రీమియర్ అయినప్పటి నుండి హాలీవుడ్ విమర్శకులు, స్క్రీన్ రైటర్స్, డైరెక్టర్స్ సోషల్ మీడియాలో ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ మిడ్ సీజన్ అవార్డ్స్ ప్రకటించింది. ఇందులో ‘ఆర్ఆర్ఆర్’ ఉత్తమ చిత్రం విభాగంలో ‘బ్యాట్ మేన్, టాప్ గన్’ వంటి సినిమాలతో పాటు నామినేట్ అయింది.

ఇక ఈ విభాగంలో ఉత్తమ చిత్రంగా ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ సినిమా ఎంపిక అయింది. రెండవ ఉత్తమ చిత్రంగా మన ‘ఆర్ఆర్ఆర్’ ఎంపిక కావటం విశేషం. నిజంగా ఇది ఓ అధ్బుతమే అని చెప్పాలి. ‘బాహుబలి’తో తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకువెళ్ళిన రాజమౌళి ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’తో అవార్డుల విషయంలోనూ అతర్జాతీయంగా గుర్తింపు వచ్చేలా చేశాడు. మరి మునుముందు ఈ సినిమా ఇంకెన్ని అవార్డులను కొల్లగొడుతుందో చూడాలి.

Exit mobile version