Site icon NTV Telugu

Ram Charan: ఆస్కార్ రేసులో మెగా పవర్ స్టార్.. తారక్ కు పోటీ..?

Chran

Chran

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి ఘనవిజయం అందుకున్నదో అందరికి తెల్సిందే. అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటించాడు అనడం కన్నా జీవించాడు అని చెప్పాలి. ఇక ఈ సినిమాతో మెగా హీరోకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ బేస్ పెరిగింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటన నేనంటే నేను అన్న విధంగా ఉంటుంది. ఇక ఈ సినిమాలోనే కాదు. ఈ స్టార్ హీరోలు ఆస్కార్ బరిలో కూడా పోటీ పడుతున్నారు.

ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీమ్ పాత్రకుగాను ఆస్కార్ నామినేషన్స్ లో ఎన్టీఆర్ పేరు ఉందని అమెరికాకు చెందిన మూవీ పబ్లిషర్ వెరైటీ పేర్కొంది. ఇక తాజాగా మరో జాబితాను వెరైటీ పబ్లిష్ చేసింది. ఇందులో రామ్ చరణ్ పేరు ఉండడం విశేషం. అల్లూరి సీతారామరాజు పాత్రకు గాను రామ్ చరణ్ ఆస్కార్ బరిలో నిలిచినట్లు తెలుస్తోంది. ఒక వేళ ఇదే కనుక నిజమైతే మెగా ఫ్యాన్స్ కు పూనకాలే. ఏదిఏమైనా సినిమాలో పోటాపోటీగా నటించిన ఈ ఇద్దరు స్నేహితులు.. ఇప్పుడు ఆస్కార్ బరిలో పోటీకి దిగుతున్నారు. ఎవరు గెలుస్తారో..? ఎవరు ఓడిపోతారో చూడాలి. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు తమతమ సినిమాలతో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్.. శంకర్ సినిమాతో బిజీగా ఉండగా.. తారక్, ఎన్టీఆర్ 30 చిత్రంలో నటిస్తున్నాడు.

Exit mobile version