NTV Telugu Site icon

Naatu Naatu: వెస్ట్రన్ గడ్డపై మన నాటు డాన్స్ హవా…

Rrr

Rrr

ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ ని అవమానిస్తూ ఇంగ్లీష్ వాళ్లు వెస్ట్రన్ డాన్స్ స్టైల్ ని చూపిస్తుంటే… మన నాటు డాన్స్ సత్తా ఏంటో చూపిస్తూ ‘నాటు నాటు’ సాంగ్ కి దుమ్ము లేచిపోయే రేంజులో డాన్స్ చేశారు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు. ఇండియాస్ బెస్ట్ డాన్సర్స్ ఆన్ స్క్రీన్ పర్ఫెక్ట్ సింక్ తో డాన్స్ చేస్తుంటే పాన్ ఇండియాలోని ప్రతి థియేటర్ లో విజిల్స్ మోతమోగింది. డాన్స్ కి సాంగ్ కి ఇండియన్ ఆడియన్స్ ఏ కాదు వరల్డ్ లోని ఎక్కడి ఆడియన్స్ అయిన కనెక్ట్ అవుతారు అని నిరుపిస్తూనే ఉంది నాటు నాటు సాంగ్. సముద్రాలు దాటి కూడా వినిపిస్తున్న నాటు నాటు ఇప్పటివరకూ ఎన్ని ఇంటర్నేషనల్ అవార్డ్స్ గెలుచుకుందో చూద్దాం. గోల్డెన్ గ్లోబ్, హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్, హాలీవుడ్ మ్యూజిక్ ఇన్ మీడియా, హౌస్టన్ ఫిల్మ్ క్రిటిక్స్, లాస్ వేగాస్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ అవార్డ్స్, లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోషియేషన్, శాటిలైట్ అవార్డ్స్… లాంటి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ లో సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ ‘నాటు నాటు’ సాంగ్ అవార్డ్ గెలుచుకుంది.

తాజాగా నాటు నాటు సాంగ్ అవార్డ్స్ లిస్టులో ‘క్రిటిక్స్ ఛాయిస్’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డ్ కూడా వచ్చి చేరింది. ఒక ఇండియన్ సినిమా చేరుకోలేని ప్రతి చోటుకి ఆర్ ఆర్ ఆర్ సినిమా చేరుతోంది కానీ ఆర్ ఆర్ ఆర్ సినిమాని మాత్రం ప్రతి చోటుకి తీసుకోని వెళ్తోంది మాత్రం ‘నాటు నాటు’ పాటనే. ఈ పాటే మనకి చరణ్, ఎన్టీఆర్ ల సూపర్బ్ డాన్స్ ఇచ్చింది. ఈ పాటే మనకి ఎన్నో ప్రెస్టీజియస్ అవార్డ్స్ గెలుచుకునేలా చేసింది. ఈ పాటే మనకి ఆస్కార్ తీసుకోని వస్తుందని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. మార్చ్ 12న నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ రావాలి, ఆ ప్రెస్టీజియస్ అవార్డ్ ఇండియాకి రావాలని ప్రస్తుతం ప్రతి ఇండియన్ కోరుకునే ఈ ఒక్క కోరిక నిజమవుతుందేమో చూద్దాం.