NTV Telugu Site icon

RRR: ఆర్ఆర్ఆర్ ఖాతాలో మరో అవార్డ్.. తొలి భారతీయ సినిమాగా..

Rrr Critics Choice Award

Rrr Critics Choice Award

RRR Movie Won Critics Choice Award for Best Foreign Language Film: తన థియేట్రికల్ రన్‌లో బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు బద్దలుకొట్టిన ఆర్ఆర్ఆర్ సినిమా.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యాక అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఈ సినిమా.. తన ఖాతాలో ఒకదాని తర్వాత మరొక అవార్డ్‌ని వేసుకుంటోంది. ఇటీవల బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు నాటు’ పాటకు గాను గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని అందుకున్న విషయం అందరికీ తెలిసిందే! ఈ అవార్డ్ అందుకున్న తొలి భారతీయ సినిమాగా ఆర్ఆర్ఆర్ చరిత్రపుటలకెక్కింది. ఇప్పుడు లేటెస్ట్‌గా ఈ సినిమా మరో అరుదైన ఘనత సాధించింది. బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్‌గా క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్‌ని సొంతం చేసుకుంది. ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’, ‘అర్జెంటీనా 1985’, ‘బార్డో’, ‘ఫాల్స్ క్రానికల్ ఆఫ్ హ్యాండ్‌ఫుల్ ఆఫ్ ట్రూత్స్’, ‘క్లోజ్’, ‘డిసిషన్ టు లీవ్’ వంటి సినిమాలపై ఆర్ఆర్ఆర్ పోటీ పడి.. ఈ అవార్డ్‌ని కైవసం చేసుకుంది.

Bala Murugan : రచయిత బాలమురుగన్ కన్నుమూత

ఈ సందర్భంగా క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ ట్విటర్ మాధ్యమంగా ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేసింది. దర్శకధీరుడు రాజమౌళి ఈ పురస్కారాన్ని గెలిచిన అనంతరం తన తనయుడు కార్తికేయతో కలిసి గౌరవంతో ఫోటోలకు పోజులిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోని క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ తన ట్విటర్‌ హ్యాండిల్‌లో షేర్ చేసింది. అభిమానులు కూడా ఓ ఇండియన్ సినిమా ఈ అవార్డ్ అందుకున్నందుకు చాలా గర్వపడుతున్నారు. అంతర్జాతీయంగా భారతీయ చిత్రసీమ ఖ్యాతిని చాటుతున్నందుకు రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కాగా.. ఈ సినిమాలో రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ హీరోలుగా నటించగా.. అజయ్ దేవ్‌గణ్, ఆలియా భట్, శ్రియా శరణ్, రే స్టీవెన్‌సన్, అలిసన్ డూడీ, ఒలివియా మోరిస్ కీలక పాత్రలు పోషించారు. 1920 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రం.. ఇండియన్ బాక్సాఫీస్‌పై తాండవం చేసి రూ.1100 కోట్లకుపైగా వసూళ్లు కొల్లగొట్టింది. అటు జపాన్‌లోనూ ఇది రప్ఫాడించేస్తోంది.

Shraddha Das: బొడ్డు అందాలతో బంతాడేస్తున్న శ్రద్దా..

Show comments