Site icon NTV Telugu

“ఆర్ఆర్ఆర్” టీం సంబరాలు… పిక్స్ వైరల్

RRR Movie Ukraine Schedule Wrapped up

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న పిరియాడికల్ యాక్షన్ డ్రామా “ఆర్ఆర్ఆర్”. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఆగష్టు మొదటి వారంలో సినిమా చివరి షెడ్యూల్ కోసం హీరోలతో సహా “ఆర్ఆర్ఆర్” టీం మొత్తం ఉక్రెయిన్ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ నిన్న పూర్తయ్యింది. దీంతో నిన్ననే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చేశారు. బుధవారం ఉదయం ఎన్టీఆర్ హైదరాబాద్ విమానాశ్రయంలో క్యాజువల్ లుక్ లో కన్పించిన పిక్స్ ఇంటర్నెట్ లో చక్కర్లు కొట్టాయి. అదే రోజు సాయంత్రం దర్శకుడు రాజమౌళితో పాటు “ఆర్ఆర్ఆర్” టీం అంతా కలిసి షూటింగ్ పూర్తయిన సందర్భంగా సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు. రాజమౌళి కేక్ కటింగ్ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ టీం అంతా హైదరాబాద్ వచ్చాక ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. సినిమా రిలీజ్ డేట్ పై నెలకొన్న సస్పెన్స్ కు ఈ ప్రెస్ మీట్ లో తెరపడనుంది.

Read Also : ‘క్రేజీ అంకుల్స్‌’ అడల్ట్ సినిమా.. అడ్డుకుంటాం!

ఇక డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పై డివివి దానయ్య అత్యంత్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, సముద్రకని, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ సహాయక పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version