Site icon NTV Telugu

RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ క్లైమాక్స్ ఫైట్.. మేకింగ్ వీడియో చూస్తే అబ్బా అనాల్సిందే..

Rrr Movie Climax Scene Visual Effects

Rrr Movie Climax Scene Visual Effects

దర్శక ధీరుడు రాజమౌళి, మెగాపవర్‌ స్టార్ రామ్ చరణ్‌, యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ ఏడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ రాబట్టింది. బాలీవుడ్‌ బ్యూటీ అలియాభట్‌, హాలీవుడ్‌ ముద్దుగుమ్మ ఓలివియా మోరీస్‌, శ్రియాశరణ్‌, అజయ్‌దేవ్‌గణ్‌, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. అల్లూరిగా రామ్‌చరణ్‌, భీమ్‌గా ఎన్టీఆర్‌ ఆయా పాత్రల్లో ఒదిగిపోగా.. రాజమౌళి తెరకెక్కించిన విధానం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌, మ్యూజిక్‌, యాక్టింగ్‌.. ఇలా అన్ని కోణాల్లో తిరుగులేదు అనిపించింది ఈ చిత్రం. బలమైన కథకు విజువల్ ఎఫెక్ట్స్‌ను జోడించి కొత్త అనుభూతిని పంచారు దర్శకుడు రాజమౌళి. ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్‌కు పెద్దపీట వేసిన సంగతి తెలిసిందే.

సినిమాలో క్లైమాక్స్‌లో ‘ఫారెస్ట్ ఫైట్‌’ విజువల్స్‌కు సంబంధించిన వీడియో విడుదలైంది. ‘మకుట విజువల్‌ ఎఫెక్ట్స్‌’ సంస్థ ఆ ఫైట్ సీన్‌కు సంబంధించి విజువల్స్‌ను జోడించింది. దీనికోసం ఆ సంస్థ 240 షాట్స్‌ను క్రియేట్ చేసింది. ఈ మేకింగ్ వీడియోను చూస్తే ఎవరైనా అబ్బా అనాల్సిందే. థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రస్తుతం ఓటీటీలోనూ దుమ్ములేపుతోంది. అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చిత్రంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రికార్డు కొట్టినట్లు నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. అలాగే ఈ మూవీ మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5లో ఈ చిత్రం తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్‌ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతున్నాయి.

Exit mobile version