Site icon NTV Telugu

గెట్ రెడీ ఫర్ “ఆర్ఆర్ఆర్” మాస్ ఆంథెమ్… పిక్ వైరల్

RRR

RRR

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. దిగ్గజ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7 న సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను ఇప్పటి నుంచే షురూ చేస్తున్నారు మేకర్స్. నిన్న ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ “నాటు నాటు” సాంగ్ ప్రోమోను రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు “నాటు నాటు” పూర్తి పాటను విడుదల చేయనున్నారు. తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ తో మరోసారి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు మేకర్స్. రామ్ చరణ్, ఎన్టీఆర్ సెట్ లో కూర్చుని చిరునవ్వులు చిందిస్తున్న ఫోటో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో ట్రెండ్ అవుతోంది. సాయంత్రం విడుదల కానున్న ఈ ఊర మాస్ సాంగ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు ఎదురు చూస్తున్నారు.

Read also : డేటింగ్ యాప్ లో ప్రముఖ హీరోయిన్… మీమ్స్ ?

https://www.youtube.com/watch?v=OVY7_ki60UU
Exit mobile version