ముంబై తర్వాత దిగ్గజ దర్శకుడు రాజమౌళి తన దృష్టిని దక్షిణాది వైపు మళ్లించాడు. ముంబైలో తారక్, చరణ్, రాజమౌళి “బిగ్ బాస్ సీజన్ 15” నుంచి “ది కపిల్ శర్మ షో”తో సహా ప్రముఖ టీవీ షోలలో భాగంగా ఇంటర్వ్యూలు ఇచ్చి అక్కడ సినిమా విడుదలపై భారీగా హైప్ పెంచేశారు. ఇక ఇప్పటిదాకా బాలీవుడ్ పై పూర్తిగా ఫోకస్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ త్రయం ఇప్పుడు సౌత్ లో ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి సరికొత్త ప్లాన్స్ వేస్తోంది. తమిళంలో కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్’ని విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే ఇక్కడ కూడా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ రేంజ్ లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
తమిళంలో ‘ఆర్ఆర్ఆర్’ను విడుదల చేస్తున్న లైకా ప్రొడక్షన్స్ తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ, వేదికను ప్రకటించింది. ‘ఆర్ఆర్ఆర్’ తమిళ ప్రీ రిలీజ్ ఈవెంట్ 2221 డిసెంబర్ 27న చెన్నై ట్రేడ్ సెంటర్‌లో సాయంత్రం 6 గంటల నుండి జరుగుతుందని అనౌన్స్ చేశారు. ఈ కార్యక్రమానికి ‘ఆర్ఆర్ఆర్’ ప్రధాన తారాగణం హాజరుకానున్నారు. మరోవైపు కేరళ ఈవెంట్‌పై కూడా సందడి నెలకొంది. బజ్ ప్రకారం ‘ఆర్ఆర్ఆర్’ కేరళ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు తిరువనంతపురంలోని ఉదయ్ ప్యాలెస్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
